ePaper
Sunday, August 9, 2026
ePaper
Homeఎడిటోరియల్కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా వైస్ చైర్మన్‌గా దస్తగిరి ఖాన్

కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా వైస్ చైర్మన్‌గా దస్తగిరి ఖాన్

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా వైస్ చైర్మన్‌గా దస్తగిరి ఖాన్

కొలన్ హన్మంత్ రెడ్డిని కలిసి నియామక పత్రం స్వీకరణ

పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచన

 

కుత్బుల్లాపూర్, ఆగస్టు 6: ( నమస్తే భరత్ ); మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా వైస్ చైర్మన్‌గా దస్తగిరి ఖాన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నియామక పత్రాన్ని స్వీకరించారు. అనంతరం దస్తగిరి ఖాన్, కొలన్ హన్మంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతంతో పాటు మైనారిటీల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాదేవపురం డివిజన్ అధ్యక్షుడు సిద్ధనోళ్ల సంజీవరెడ్డి, టీపీసీసీ మైనారిటీ డిపార్ట్‌మెంట్ స్టేట్ జాయింట్ కన్వీనర్ సమీర్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వలి భాయ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!