ePaper
Monday, August 3, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

📰 Generate e-Paper Clip

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంర్ఫ్ ) కింద మంజూరైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ రవి నాయక్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కన్య తండాకు చెందిన ప్రమాదంలో గాయపడిన చిన్నారి బానోతు భవితకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.1,20,000 (ఒక లక్ష ఇరవై వేల రూపాయలు) విలువైన చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా గుగులోత్ రవి నాయక్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం ద్వారా సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి తండా సర్పంచ్ బానోత్ భద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!