ePaper
Monday, August 3, 2026
ePaper
Homeఎడిటోరియల్అక్రిడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్‌కు ప్రాతినిధ్యం ఇవ్వాలి

అక్రిడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్‌కు ప్రాతినిధ్యం ఇవ్వాలి

📰 Generate e-Paper Clip

అక్రిడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్‌కు ప్రాతినిధ్యం ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

ఇది మా టీడబ్ల్యూజేఎఫ్ సభ్యుల విజయం

రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

వరంగల్ , ఆగస్టు 03 (నమస్తే భారత్ ) :
రాష్ట్రంలోని అన్ని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (డీఎంఏసీ)ల్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)కు ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మీడియా అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటు విషయంలో జర్నలిస్టు సంఘాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. అన్ని అర్హతలున్న టీడబ్ల్యూజేఎఫ్ కు అక్రెడిటేషన్ కమిటీల్లో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేసే సమయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్‌కు ప్రాతినిధ్యం ఇవ్వకుండా వ్యవహరించడాన్ని సవాల్ చేస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దాఖలైన రిట్ పిటిషన్‌పై గత ఆరు నెలలుగా పలుమార్లు విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కార్యాలయ న్యాయవాదులు, పిటిషనర్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు కోర్టు ముందు వినిపించారు.ఇరుపక్షాల వాదనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, మీడియా అక్రిడిటేషన్ కమిటీల ఏర్పాటు విధానం, జర్నలిస్టు సంఘాల ప్రాతినిధ్యానికి సంబంధించిన నిబంధనలను పరిశీలించిన అనంతరం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహినుద్దీన్‌ల ధర్మాసనం సోమవారం తీర్పును వెలువరించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్‌కు కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ తీర్పుతో రాష్ట్రంలోని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీల్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్‌కు అధికారిక ప్రాతినిధ్యం లభించే మార్గం సుగమమైంది. జర్నలిస్టు సంఘాల మధ్య సమాన అవకాశాలు, పారదర్శకత, న్యాయబద్ధమైన ప్రాతినిధ్యానికి ఈ తీర్పు దోహదపడుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హైకోర్టు తీర్పును తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించింది. జర్నలిస్టుల హక్కులు, గౌరవం, సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలన్న తమ పోరాటానికి ఇది న్యాయపరమైన విజయమని పేర్కొంది. ఈ తీర్పును వెంటనే అమలు చేసి, అన్ని జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంఘం నాయకులు కోరారు.
ఈ తీర్పు భవిష్యత్తులో మీడియా అక్రిడిటేషన్ కమిటీల ఏర్పాటులో అన్ని గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాలకు సముచిత ప్రాధాన్యం కల్పించేలా మార్గదర్శకంగా నిలుస్తుందని జర్నలిస్టు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. న్యాయం, ధర్మం తమవైపు ఉందని, హైకోర్టు ఇచ్చిన తీర్పు తమ సంఘం సభ్యుల విజయం అని రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య పేర్కొన్నారు.

*జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో ఒక చారిత్రాత్మక మైలురాయి* :

*టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ మెంబర్ మల్లేష్*

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీలలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ )కు ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ మెంబర్ బి.మల్లేష్ అన్నారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ
ఈ విజయానికి ప్రధాన కారణమైన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య కి నా హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
యూనియన్‌కు న్యాయం జరగాలని సంకల్పించి, ప్రభుత్వంతో న్యాయపరంగా పోరాడుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, అనేక నెలల పాటు న్యాయపోరాటం సాగించి ఈ చారిత్రాత్మక తీర్పును సాధించడం నిజంగా ప్రశంసనీయం. ఇది కేవలం ఒక యూనియన్ విజయం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి శ్రమజీవి జర్నలిస్టు గౌరవాన్ని నిలబెట్టిన విజయం.
ఈ తీర్పుతో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్‌కు ప్రభుత్వ గుర్తింపు మరింత బలపడడమే కాకుండా, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీలలో జర్నలిస్టుల సమస్యలను సమర్థవంతంగా వినిపించే అవకాశం లభించింది.
ఈ సందర్భంగా ఈ న్యాయపోరాటంలో భాగస్వాములైన న్యాయవాదులకు, యూనియన్ రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకులకు, సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం ఇదే స్ఫూర్తితో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!