ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeఎడిటోరియల్బాచుపల్లిలో అభివృద్ధికి మరో అడుగు.. డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

బాచుపల్లిలో అభివృద్ధికి మరో అడుగు.. డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

📰 Generate e-Paper Clip

బాచుపల్లిలో అభివృద్ధికి మరో అడుగు.. డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

-273వ డివిజన్‌లో నూతన డ్రైనేజీ లైన్ నిర్మాణానికి ప్రారంభం

-ఇంద్రానగర్‌లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి

-మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యమని వెల్లడి

-ప్రతి కాలనీకి మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబాటు

-ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ

-కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు

బాచుపల్లి, జూలై 24 ( నమస్తే భరత్); కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 273వ డివిజన్ బాచుపల్లి పరిధిలో అభివృద్ధి పనులకు మరో ముందడుగు పడింది. బాచుపల్లిలో నూతన డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులతో పాటు ఇంద్రానగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాచుపల్లి ప్రాంతంలో కాలనీవాసులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయిన అనంతరం పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడి ప్రజలు ఇబ్బందుల నుంచి విముక్తి పొందుతారని చెప్పారు. అలాగే ఇంద్రానగర్‌లో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణంతో స్థానికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, వర్షాకాలంలో బురద, గుంతల సమస్యలకు చెక్ పడుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, నియోజకవర్గంలోని ప్రతి కాలనీ అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని హన్మంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ఎంపీపీ కొలన్ కృష్ణారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షుడు కొలన్ రాజశేఖర్ రెడ్డి, బాచుపల్లి అధ్యక్షుడు కొలన్ జీవన్ రెడ్డి, కొలన్ సీతారాం రెడ్డి, శంకర్, జీతయ్య, కొలన్ జనార్దన్ రెడ్డి, బాల్ రెడ్డి, జిత్తు, రాజేందర్, లచ్చి రెడ్డి, శంకర్ రెడ్డి, ఎల్లం భాయ్ సతిరెడ్డి, పరమేష్ నాయక్, జి. శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!