ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeఎడిటోరియల్కళ్లకు గంతలు కట్టుకుని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నిరసన ప్రభుత్వ విప్, డోర్నకల్...

కళ్లకు గంతలు కట్టుకుని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నిరసన ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ 

📰 Generate e-Paper Clip

కళ్లకు గంతలు కట్టుకుని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నిరసన

ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్

మరిపెడ మండలం కాంగ్రెస్ నాయకులు

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని, విభిన్న అభిప్రాయాలను అణిచివేసే ధోరణిని కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!