ePaper
Friday, September 11, 2026
ePaper
Homeఎడిటోరియల్విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తాం! హౌసింగ్ డి ఈ భూక్య. రాజన్న,

విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తాం! హౌసింగ్ డి ఈ భూక్య. రాజన్న,

📰 Generate e-Paper Clip

విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తాం!

హౌసింగ్ డి ఈ భూక్య. రాజన్న,

నమస్తే భారత్ :-మరిపెడ

పేదల కొరకు ప్రభుత్వం కేటాయించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు మా వంతు కృషి చేస్తామని హౌసింగ్ డిఈ భూక్య.రాజన్న అన్నారు. గురువారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో నిర్మించిన 26 జర్నలిస్టుల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ,హౌసింగ్ బోర్డు సమీపంలోని 40 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను డీఈ భూక్య. రాజన్న, ఏఈ కాటికల. గోపి పరిశీలించారు. ఈ సందర్భంగా డిఇ మాట్లాడుతూ! హౌసింగ్ పీడీపురుషోత్తం ఆదేశాల మేరకు తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. ఇళ్లలో విద్యుత్ సమస్య పరిష్కారానికి విద్యుత్ శాఖ నుంచి డిమాండ్ నోటీసు అందిన వెంటనే హౌసింగ్ శాఖ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చేరుతున్నందున లబ్ధిదారులు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోలబ్ధిదారులు, జర్నలిస్టులు.తదితరులుపాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!