ePaper
Wednesday, July 22, 2026
ePaper
Homeఎడిటోరియల్మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  14-15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు హెచ్‌పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం 

మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  14-15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు హెచ్‌పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం 

📰 Generate e-Paper Clip

మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో
14-15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు హెచ్‌పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం

వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ ) వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో 14-15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు హెచ్‌పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం బుధవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా మొత్తం 20 మంది బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ గుగులోతు.రవి.మాట్లాడుతూ.బాలికల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. చిన్న వయసులోనే ఈ వ్యాక్సిన్ అందించడం ద్వారా భవిష్యత్తులో ప్రాణాంతక క్యాన్సర్ల బారిన పడకుండా బాలికలను రక్షించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ లక్ష్మి కుమారి, ఏఎన్ఎం నాగమణి, ఆశా ఆరోగ్య కార్యకర్తలు శ్రీదేవి, సునీత, కవిత, వినోద మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొని వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!