ePaper
Tuesday, August 25, 2026
ePaper
Homeఎడిటోరియల్మరిపెడ పి.హెచ్.సి లో 26 మంది టీబీ రోగులకు పోషణ కిట్ల పంపిణీ: 45 స్ఫూటం...

మరిపెడ పి.హెచ్.సి లో 26 మంది టీబీ రోగులకు పోషణ కిట్ల పంపిణీ: 45 స్ఫూటం శాంపిల్స్ సేకరణ

📰 Generate e-Paper Clip

మరిపెడ పి.హెచ్.సి లో 26 మంది టీబీ రోగులకు పోషణ కిట్ల పంపిణీ: 45 స్ఫూటం శాంపిల్స్ సేకరణ

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు, మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్ ) ‘టీబి ముక్త్ భారత్’ (క్షయ రహిత భారత్) కార్యక్రమంలో భాగంగా మంగళవారం టీబి నిర్ధారణ అయిన 26 మంది రోగులకు పోషణ కిట్లను అందజేశారు. పి.హెచ్.సి వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో ఈ.కార్యక్రమం.నిర్వహించబడింది.ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ రవి మాట్లాడుతూ, టీబీ వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచనల మేరకు మందులను క్రమం తప్పకుండా వాడుతూ, ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా త్వరగా కోలుకుంటారని తెలిపారు. దేశాన్ని టీబీ రహితంగా మార్చేందుకు ప్రజలు, ఆరోగ్య సిబ్బంది ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
45 స్ఫూటం శాంపిల్స్ సేకరణ:
క్షయ వ్యాధి ముందస్తు గుర్తింపు చర్యల్లో భాగంగా, మరిపెడ మండలంలోని వివిధ గ్రామాల నుండి అనుమానితుల యొక్క 45 స్ఫూటం (కఫం) శాంపిల్స్ సేకరించినట్లు వైద్యాధికారి తెలిపారు. ఖచ్చితమైన నిర్ధారణ పరీక్షల నిమిత్తం ఈ శాంపిల్స్‌ను జిల్లా కేంద్ర ల్యాబ్‌కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పి.హెచ్.ఎన్ మంగమ్మ, హెల్త్ సూపర్‌వైజర్లు ఆచార్యులు, లక్ష్మి కుమారి, టీబీ ఎస్.టి.ఎల్.ఎస్ సందీప్, హెల్త్ అసిస్టెంట్లు వీరయ్య, నర్సయ్య, మరియు ఆశా ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!