ePaper
Saturday, July 18, 2026
ePaper
Homeఎడిటోరియల్కార్మికుడికి నిలిచిపోయిన వేతనం ఇప్పించిన బీఆర్‌టీయూ రాష్ట్ర నాయకుడు రవి

కార్మికుడికి నిలిచిపోయిన వేతనం ఇప్పించిన బీఆర్‌టీయూ రాష్ట్ర నాయకుడు రవి

📰 Generate e-Paper Clip

కార్మికుడికి నిలిచిపోయిన వేతనం ఇప్పించిన బీఆర్‌టీయూ రాష్ట్ర నాయకుడు రవి
జీడిమెట్ల పరిశ్రమలో కార్మికుడికి న్యాయం

మే నెల వేతనం చెల్లించేలా యాజమాన్యంతో చర్చలు

ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు

శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి చొరవతో సమస్య పరిష్కారం

న్యాయం జరిగినందుకు కార్మికుడి ఆనందం

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కార్మిక ప్రతినిధు..

జీడిమెట్ల, జూలై 17 ( నమస్తే భరత్):
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పరిశ్రమల ప్రాంతంలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసిన సంజయ్ కుమార్‌కు రావాల్సిన మే నెల వేతనాన్ని బీఆర్‌టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి చొరవతో యాజమాన్యం చెల్లించింది. సంజయ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా సంబంధిత కంపెనీలో విధులు నిర్వర్తించారు. వ్యక్తిగత అనివార్య కారణాలతో ఉద్యోగం విరమించుకున్న అనంతరం ఆయనకు రావాల్సిన మే నెల వేతనాన్ని సంస్థ యాజమాన్యం చెల్లించకుండా పలుమార్లు తిప్పిపంపినట్లు సమాచారం. పలుమార్లు యాజమాన్యాన్ని సంప్రదించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో తోటి కార్మికుల సూచన మేరకు బీఆర్‌టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు రవిని కలిసి తన గోడును వివరించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే స్పందించిన రవి నేరుగా సంబంధిత కంపెనీ యాజమాన్యాన్ని కలిసి కార్మికుడికి రావాల్సిన వేతనాన్ని వెంటనే చెల్లించేలా చర్చలు జరిపారు. దీంతో యాజమాన్యం సంజయ్ కుమార్‌కు పెండింగ్‌లో ఉన్న మే నెల వేతనాన్ని చెల్లించింది. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ, తనకు, తన కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేసిన బీఆర్‌టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు రవికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఇటువంటి సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ గౌడ్, సుదర్శన్, జగన్, మోజెష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!