ePaper
Thursday, June 11, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రతిభావంతులైన బాలలకు ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌కు దరఖాస్తుల ఆహ్వానం 

ప్రతిభావంతులైన బాలలకు ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌కు దరఖాస్తుల ఆహ్వానం 

Applications Invited for Pradhan Mantri Rashtriya Bal Puraskar for Talented Children

📰 Generate e-Paper Clip

ప్రతిభావంతులైన బాలలకు ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌కు దరఖాస్తుల ఆహ్వానం 

కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్  జూన్ 9 (నమస్తే భారత్ ) :
దేశ నిర్మాణంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన బాలలను గుర్తించి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ -2026 కోసం నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు  వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ధైర్యసాహసం, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు-సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన 18 సంవత్సరాల లోపు బాలలు ఈ పురస్కారానికి అర్హులని పేర్కొన్నారు. అర్హులైన బాలల ప్రతిభను జాతీయ స్థాయిలో గుర్తించి గౌరవించేందుకు ఈ అవార్డులుఅందజేయబడతాయని తెలిపారు. నామినేషన్లు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించబడతాయని, అర్హులైన బాలల వివరాలను సంబంధిత అధికారులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజలు గుర్తించి సిఫారసు చేయాలని కోరారు. బాలికలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలు, దివ్యాంగులలోని ప్రతిభావంతులను ప్రత్యేకంగా గుర్తించి నామినేషన్లు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్-2026 నామినేషన్లకు జూలై 31, 2026 చివరి తేదీ కాగా, జిల్లా స్థాయిలో పరిశీలన కోసం సంబంధిత వివరాలను జూన్ 30, 2026లోగా కలెక్టర్ కార్యాలయానికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!