ePaper
Saturday, June 13, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రజారోగ్య రక్షణలో వైద్యుల పాత్ర కీలకం

ప్రజారోగ్య రక్షణలో వైద్యుల పాత్ర కీలకం

📰 Generate e-Paper Clip

ప్రజారోగ్య రక్షణలో వైద్యుల పాత్ర కీలకం

నమస్తే భారత్ :-తొర్రూరు

ప్రజా ఆరోగ్య రక్షణలో వైద్యుల పాత్ర కీలకమని తొర్రూరు ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు అన్నారు.తొర్రూరు ఏరియా ఆసుపత్రికి బదిలీపై వచ్చిన జనరల్ సర్జన్ డాక్టర్ అలువాల విజయ్ కుమార్ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఆయనకు సహచర వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సూపరిటెండెంట్ సుగుణాకర్ రాజు మాట్లాడుతూ
వైద్యుల చేరిక పేదల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తుందని తెలిపారు.ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ప్రేమ పూర్వకంగా వ్యవహరించి వైద్యం అందించాలని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని కోరారు. డాక్టర్ విజయ్ కుమార్ తొర్రూరు ప్రాంత ప్రజలకు సుపరిచితులని, వారి అనుభవం ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ గిరి ప్రసాద్, డాక్టర్ శంకర్, అనిల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!