ePaper
Friday, July 31, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి .  

ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి .  

📰 Generate e-Paper Clip

ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి .
నకిలీ విత్తనాలను అరికట్టాలి.

అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జు దేవేందర్.

నమస్తే భారత్ :-తొర్రూరు

తొర్రూరు 12 జూన్ డివిజన్ కేంద్రంలోని అఖిలభారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతుల ఎరువుల ధరల ను తగ్గించాలని నకిలీ విత్తనాలను అరికట్టాలని సంఘ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రాస్తారోకో ను ఉద్దేశించి అఖిలభారత రైతుకూలీ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జు దేవేందర్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతుల ఎరువుల ధరల ను వెంటనే తగ్గించాలి. అంతేకాకుండా నకిలీ విత్తనాలను అరికట్టాలి. రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లను ఇవ్వాలని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఎరువుల ధరలను పెంచడం ఆమానుషమని అన్నారు.అదేవిధంగా ఎరువుల దుకాణాలపై అధికారులు నిరంతరం పర్యావేక్షించాలని డిమాండ్ చేశారు. అధికారులు రైతులకు నిరంతరంగా అందుబాటులో ఉండాలని అన్నారు. అదేవిధంగా రైతులకు యురియా పై ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు .అదేవిధంగా హామీ పథకం కింద కూలీలను రైతాంగానికి అనుసంధానం చేయాలని వారు అన్నారు. ఇంకా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఉడుగుల లింగన్న పాల్గొని మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల ను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే రైతు కూలీ సంఘం మరియు పార్టీగా దశలవారీగా అనేక ఆందోళన కార్యక్రమాలను చేస్తామని హెచ్చరించారు. నాయకులు చిరా యాకన్న, నక్కయాకన్న , తండ సురేష్, షాజహాన్, రమేష్, శ్రీను, ఉపేంద్ర, మల్లమ్మ, యాకమ్మ, ఎల్లయ్య. రాములు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!