ePaper
Saturday, August 8, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎరుకల సంఘం మహిళ జిల్లా కమిటీ ఎన్నిక

ఎరుకల సంఘం మహిళ జిల్లా కమిటీ ఎన్నిక

📰 Generate e-Paper Clip

ఎరుకల సంఘం మహిళ జిల్లా కమిటీ ఎన్నిక

నమస్తే భారత్ :-తొర్రూరు

తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం మహబూబాబాద్ జిల్లా మహిళా కమిటీని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూతాటి కుమార్ ఆదేశాల మేరకు గురువారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఆ సంఘం మహిళ రాష్ట్ర నాయకురాలు నడిగడ్డ శైలజ ఆధ్వర్యంలో.ఏకగ్రీవంగా.ఎన్నుకున్నారు.ఎరుకల సంఘం మహిళా జిల్లా అధ్యక్షురాలుగా నడిగడ్డ బుచ్చమ్మ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నడిగడ్డ నాగమణి,కార్యదర్శిగా పుట్ట బంతి ఉపేంద్ర,కోశాధికారిగా మాదగాని రజిత, ఉపాధ్యక్షురాలుగా మాదగాని రమ, రాయపురం హైమావతి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా నాయకురాలు నడిగడ్డ శైలజ మాట్లాడుతూ ఎరుకల మహిళల హక్కుల సాధన కోసం తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. గిరిజనుల జనాభా 10 శాతం పెరిగినందున ఆ మేరకు రిజర్వేషన్ పెంచాలన్నారు.
ఎరుకల హక్కుల కోసం నిఖార్సు గా పోరాడుతున్న తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం మహిళ నాయకత్వానికి ప్రభుత్వ పదవులు కేటాయించి.గౌరవించాలన్నారు.ఎరుకల మహిళా సంఘం ఆధ్వర్యంలో గత కొంత కాలంగా ఎరుకల అభివృద్ధికి అంకితభావంతో.పనిచేస్తుందన్నారు.గత ప్రభుత్వాల నిర్వాకంతో ఎరుకల సామాజిక వర్గం అభివృద్ధి చెందలేదని, ప్రస్తుత ప్రభుత్వం ఎరుకల మహిళల అభ్యున్నతికి.పాటుపడాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎరుకల సామాజిక వర్గానికి సంక్షేమ పథకాల అమలు చేసి ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎరకల సంఘం జిల్లా అధ్యక్షుడు పేరం వీరస్వామి,సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేదిరి ఉప్పలయ్య, జిల్లా.ప్రధాన.కార్యదర్శి.పేరం.బక్కయ్య,తొర్రూరు, దంతాలపల్లి, కేసముద్రం, ఇనుగుర్తి మండలాల అధ్యక్షులు తిరుపతి ఏసు, మానుపాటి సారంగం, కట్ల పాపయ్య, మాద గాని ఉప్పలయ్య, పెద్దవంగర మండల ప్రధాన కార్యదర్శి మాదగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!