పాకాల తూము గేట్లు ఎత్తకపోతే రైతులతో ఆందోళన
బీఆర్ ఎస్ ఖానాపురం మండల పార్టీ అల్టిమేటం
ఖానాపురం జులై15 (నమస్తే భారత్ ) :
ఖరీఫ్ సీజన్ లో నారుమడి దశ అయిపోతున్న పాకాల సరస్సు నీటిని విడుదల చేయకుండా స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు, అధికారుల అసమర్థతతోనే నీటి విడుదల ఆలస్యం చేస్తున్నారని ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, బీఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నర్సయ్య అన్నారు. ఈ సందర్భంగా ఖానాపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాకాల సరస్సు కింద 30 వేల ఎకరాల్లో నిరంతరం సస్యశ్యామలంగా ఉండాలని ఆనాడు కెసిఆర్ కృషితో నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గొప్ప సంకల్పంతో పాకాల చెరువుకు గోదావరి జలాల ప్రాజెక్టు తీసుకవస్తే కనీసం దీనిని అమలు చేయలేని చేతగానితనంలో ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఉండడం ఈ ప్రాంత సిగ్గుచేటని అన్నారు. పాకాల తూము గేట్లు 16.07.2026 నాడు ఉదయం 10 గంటల లోపు ప్రభుత్వం, అధికారులు నీటి విడుదల చేయకుంటే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితులైన పాకాల తూము గేట్లను ఎత్తుతాం అని హెచ్చరించారు.
పాకాల తూము గేట్లు ద్వారా సాగునీరు విడుదల చేయడంలో అధికార పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు ఈ ప్రాజెక్టుపై అవగాహన లేకుంటే నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి సలహా తీసుకోనైనా నీటి విడుదలకు పూనుకోవాలని సూచించారు. ఈ ప్రాంతం ఎప్పుడు పచ్చటి తోరణంలా ఉండాలని 300 కోట్ల రూపాయలతో పాకాలకు గోదావరి జలాల ప్రాజెక్టు తీసుకువస్తే నేడు దాన్ని నిరుపయోకంగా ఉంచిన ఘనత అధికార కాంగ్రెస్ పార్టీకి, స్థానిక ఎమ్మెల్యేకే దక్కుతుందని విమర్శించారు.ఈకార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామసహాయం ఉపేందర్ రెడ్డి ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్ గ్రామ పార్టీ అధ్యక్షులు మచ్చిక అశోక్ బంధారపు శ్రీనివాస్ తేజావత్ బాలునాయక్, ఉపసర్పంచ్ ఉప్పురాజు, పార్టీ నాయకులు వల్లెపు శ్రీనివాస్ ,వేజెల్ల కిషన్ రావు, ఆబోతు అశోక్,అజహర్, బోడ పూలు నాయక్, మర్రి రామస్వామి, నామాల రవి, బోడ దేవా, కొలిశెట్టి పూర్ణచందర్రావు గుండ్లపల్లి విజయ్, బూస అశోక్, ఓర్సు రవి తదితరులు పాల్గొన్నారు.



