ePaper
Wednesday, June 3, 2026
ePaper
Homeతెలంగాణఆదిలాబాద్ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గుడిహత్నూర్ విద్యార్థి ప్రతిభ*: అభినందించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా*

ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గుడిహత్నూర్ విద్యార్థి ప్రతిభ*: అభినందించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా*

📰 Generate e-Paper Clip

Adilabad : ఇటీవల విడుదల అయిన ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన  ముండే ఓంప్రసాద్ ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. బుధవారం విడుదలైన ఫలితాల్లో అతను 2014 వ ర్యాంకు సాధించాడు. ముండే సంజీవ్ కుమారుడైన ఓంప్రకాష్ సాధించిన ఈ విజయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

 

ఈ సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా విద్యార్థిని ప్రత్యేకంగా సన్మానించి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు.

 

 

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!