ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గుడిహత్నూర్ విద్యార్థి ప్రతిభ*: అభినందించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా*

Adilabad : ఇటీవల విడుదల అయిన ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన  ముండే ఓంప్రసాద్ ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. బుధవారం విడుదలైన ఫలితాల్లో అతను 2014 వ ర్యాంకు సాధించాడు. ముండే సంజీవ్ కుమారుడైన ఓంప్రకాష్ సాధించిన ఈ విజయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.   ఈ సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా విద్యార్థిని ప్రత్యేకంగా సన్మానించి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను...