తిరంగాకు జైకొట్టిన యువతరం.. కుత్బుల్లాపూర్లో ఘనంగా తిరంగా ర్యాలీ
దేశభక్తి నినాదాలతో మార్మోగిన కుత్బుల్లాపూర్
సుమారు 4 వేల మంది విద్యార్థులు, యువత భారీగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ
ఐడిపిఎల్ చౌరస్తా నుంచి మున్సిపల్ సర్కిల్ కార్యాలయం వరకు ర్యాలీ
తిరంగాలతో కదం తొక్కిన యువత.. వెల్లువెత్తిన దేశభక్తి
ర్యాలీని విజయవంతం చేసిన విద్యార్థులు, యువతకు అభినందనలు
బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లకు నిర్వాహకుల కృతజ్ఞతలు
కుత్బుల్లాపూర్, ఆగస్టు 13 ( నమస్తే భరత్ ): భారతీయ జనతా యువమోర్చా (BJYM) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ ఘన విజయాన్ని సాధించింది. దేశభక్తిని చాటుతూ విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొనడంతో కుత్బుల్లాపూర్ ప్రాంతం జాతీయ జెండాలతో, దేశభక్తి నినాదాలతో సందడిగా మారింది. ఐడిపిఎల్ చౌరస్తా నుంచి కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం వరకు కొనసాగిన ఈ ర్యాలీలో సుమారు 4 వేల మంది విద్యార్థులు, యువత పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని యువత ఉత్సాహంగా ర్యాలీలో కదం తొక్కారు. క్రమశిక్షణతో ర్యాలీని నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు డి. గిరి వర్ధన్ రెడ్డితో పాటు జిల్లా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని యువతను ఉత్సాహపరిచారు. ర్యాలీలో ఎస్. మల్లారెడ్డి, కొల్లి మాధవి, తాదూరి శ్రీనివాస్, కాంతారావు, శేఖర్ యాదవ్, రావుల శేషగిరి, విఘ్నేష్, నల్ల జై శంకర్ గౌడ్, వేముల రమేష్, గారిగే శేఖర్, పులి బలరాం, సుబ్బారావు, నందనం దివాకర్, రాజా సదానందం, రాజేష్ చారి, ఝాన్సీ, నాగదీప్, శ్యామ్ కిరణ్ రెడ్డి, శ్రీనాథ్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.
యువత ఉత్సాహం అభినందనీయం
ర్యాలీలో విద్యార్థులు, యువత ప్రదర్శించిన ఉత్సాహం, క్రమశిక్షణ, దేశభక్తి అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి విద్యార్థి, యువతకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ర్యాలీ విజయవంతం కోసం కృషి చేసిన బీజేవైఎం వాలంటీర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నిర్వాహకులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశభక్తి గుండెల్లో.. తిరంగా చేతుల్లో.. భారతమాత మనసుల్లో.. అనే స్ఫూర్తితో నిర్వహించిన ఈ ర్యాలీ కుత్బుల్లాపూర్లో దేశభక్తి సందేశాన్ని బలంగా చాటిందని నిర్వాహకులు పేర్కొన్నారు.



