యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి
నమస్తే భారత్ :-తొర్రూరు
విద్యార్థులు, యువత డ్రగ్స్ , మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం డ్రగ్స్ నిర్మూలన పై ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
కేయూ జువాలజీ ప్రొఫెసర్ వెంకయ్య,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బి. నారాయణ లతో కలిసి ఈసం నారాయణ మాట్లాడుతూ.డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో సమాజంలో మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒకరూ భాగస్వాములు కావాలన్నారు. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును, కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ప్రతి విద్యార్థి తన జీవిత లక్ష్యంపై దృష్టి సారించాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నరసయ్య, అలీ, రామ బ్రహ్మచారి, సువర్ణ, మల్లయ్య, నాగరాజు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



