ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeఎడిటోరియల్వెలికట్ట పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి

వెలికట్ట పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

వెలికట్ట పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి

నమస్తే భారత్ :-తొర్రూరు

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వెలికట్ట గ్రామపంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని గ్రామ వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం తొర్రూరు డివిజన్ కేంద్రంలో వార్డు సభ్యులు మాట్లాడుతూ….వెలికట్ట శివారులోని పాలకేంద్రం సమీపంలో ఉన్న 167 సర్వేనెంబర్ స్థలం కోర్టు తగాదాలో ఉండగా.దానికి నిబంధనలకు విరుద్ధంగా వార్డు సభ్యుల అంగీకారం లేకుండా ఏకపక్షంగా అనుమతి ఇచ్చాడన్నారు.ఇటీవల వార్డు సభ్యుల సమావేశం జరగగా సదరు వివాద స్థలం విషయంలో సంతకాలు పెట్టాలని ఒత్తిడి తెచ్చాడన్నారు. 7 గురు వార్డు సభ్యులు ఆ ప్రతిపాదనను తిరస్కరించి సంతకాలు చేయలేదన్నారు.మొత్తం 10 మంది వార్డు సభ్యులు ఉండగా 7 మంది సభ్యులు తీర్మానంపై సంతకాలు చేయలేదన్నారు. సమావేశానికి హాజరుకాని సభ్యుణ్ణి పంచాయతీ కార్యాలయం బయట కలిసి సంతకం చేయాలని ఒత్తిడి చేశారన్నారు.మంత్రి అండ ఉందని,పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడినని నన్నేమీ చేయలేరంటూ కార్యదర్శి బెదిరింపులకు గురి చేస్తున్నాడన్నారు. ఈ వ్యవహారంపై డిపిఓ కు విన్నవించుకున్నామన్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ వెలికట్ట కార్యదర్శి శ్రీకాంత్.ను.కాపాడుతున్నాడన్నారు. కార్యదర్శి తీరుతో గ్రామంలో పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. గ్రామం దోమల మయంగా మారి జ్వరాల బారిన పడుతున్నారన్నారు.కావున కార్యదర్శి శ్రీకాంత్ పై చర్య తీసుకొని మా గ్రామానికి అనుభవం ఉన్న కార్యదర్శులు నియమించాలని కోరారు.ఈ విషయంలో అధికారులు స్పందించి అనుభవం ఉన్న మరో కార్యదర్శిని గ్రామానికి కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు వడ్లకొండ ఎల్లమ్మ,యాసరపు సోమయ్య,కొమ్ము శారద, వీరమనేని రమేష్,భోగ సుజాత, మరిపెద్ది సుభద్ర,అల్లంనేని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!