జాషువా స్పూర్తితో సాంస్కృతిక సామాజిక పోరాటాలను చేపట్టాలి
కెవిపిఎస్ ఆధ్వర్యంలో జాషువా 131వ జయంతి వేడుకలు
దుడ్డేల రామ్మూర్తి
నమస్తే భారత్ :-మహబూబాబాద్
గుర్రం జాషువా స్పూర్తితో ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాద భావాజాలాలకు వ్యతిరేకంగా సాంస్కృతిక సామాజిక పోరాటాలను విస్తృతంగా చేపట్టాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డేల రామ్మూర్తి పిలుపునిచ్చారు.
సోమవారం స్థానిక పేరుమాండ్ల జగన్నాథం భవన్ లో కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విశ్వ మానవ మహాకవి గుర్రం జాషువా 131వ జయంతి సందర్భంగా వారు పూలమాల వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ సామ్రాజ్యవాదులు జాతీయ అగ్రవర్ణ దురహంకారాల కబంధ హస్తాలలో నలిగిపోతూ ఉండే గుంటూరు జిల్లా పలనాడు ప్రాంతంలో సనాతన ధర్మం పేరుతో సామాజిక అణచివేతతో పాటు ఆర్థిక దోపిడీని వేల సంవత్సరాల పాటు కొనసాగిందని, నేటి పాలకులు కూడా దానిని పెంచేవిధంగా యథేచ్ఛగా తమ మనువాద ఎజెండాను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడ లేని కులం యొక్క దుర్మార్గాన్ని తన కవితా రచనల ద్వారా జాషువా తీవ్రంగా కృషి చేశారని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో.మందుల మహేందర్ గద్దపాటి సంతోష్ అల్వాల ఆనంద్ మచ్చ వెంకన్న దుడ్డేలా బ్రహ్మం షేక్ ఖాదర్ బాబా అచ్చ నాగేష్ కిన్నెర నాగరాజు కిన్నెర శ్రీకాంత్ బేతమల్ల సందీప్ వంకాయల గోపీచంద్ ఆరేల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.



