ePaper
Sunday, August 30, 2026
ePaper
Homeతెలంగాణఆడబిడ్డలే అండగా… సమ్మన్నకు జనహృదయాల్లో ప్రత్యేక స్థానం!

ఆడబిడ్డలే అండగా… సమ్మన్నకు జనహృదయాల్లో ప్రత్యేక స్థానం!

📰 Generate e-Paper Clip

ఆడబిడ్డలే అండగా… సమ్మన్నకు జనహృదయాల్లో ప్రత్యేక స్థానం!

ఆపదలో అండగా ఉన్న సమ్మన్నకు ఆత్మబంధువుగా మారిన అక్కాచెల్లెళ్లు

 

నమస్తే భారత్ కేసముద్రం

 

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం. కన్నీటి కడలిలో ఉన్నవారికి ఓదార్పునివ్వడం… కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ‘నేనున్నానంటూ’ భరోసా కల్పించడం.ఇవన్నీ మాటల్లో చెప్పేవి కాదు.. చేతల్లో చూపించేవి. అలాంటి సేవా తత్వానికి ప్రతిరూపంగా నిలుస్తున్నారు కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్.

కేసముద్రం మండలంలో ఎక్కడ ఎవరికీ ఏ కష్టం వచ్చినా తనకు చేతనైన సహాయాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ఆపదలో ఉన్న అక్కా చెల్లెళ్లకు ఆత్మబంధువుగా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తూ వారి.కష్టాల్లో.పాలుపంచుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సాయం చేయడంతో పాటు, అవసరమైన వేళల్లో మానవతా దృక్పథంతో స్పందిస్తూ తన సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

కష్టంలో ఉన్నవారికి కొండంత ధైర్యం.సాయం కోసం ఎవరు తనను ఆశ్రయించినా సమస్యను తన సమస్యగా భావించే సమ్మయ్య గౌడ్‌.నాకు చేతనైనంత చేస్తాను’ అనే సేవా భావంతో ముందుకు సాగుతున్నారు. ఆపదలో ఉన్న వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ, వారి ముఖాల్లో చిరునవ్వు చూడటమే తనకు సంతృప్తినిచ్చే విషయమని చెబుతున్నారు.

బంధాలకు.అతీతంగా.మానవత్వమే బంధంగా.రక్త సంబంధాలు లేకపోయినా ఆపదలో అండగా నిలిచే వ్యక్తినే నిజమైన ఆత్మబంధువుగా భావిస్తారు. ఆ మాటకు నిదర్శనంగా సమ్మయ్య గౌడ్‌ నిలుస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు, అక్కా చెల్లెళ్ల సమస్యల పట్ల సానుభూతితో స్పందిస్తూ వారికి ధైర్యం చెప్పడం, అవసరమైన సహాయం అందించడం ఆయన సేవా తీరుకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది.సేవే లక్ష్యం.మానవత్వమే మార్గం.పదవులు, ప్రచారం కోసం కాకుండా తనకు తోచిన రీతిలో సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో సమ్మయ్య గౌడ్‌ ముందుకు సాగుతున్నారని పలువురు.అభిప్రాయపడుతున్నారు. ఒకరి కష్టాన్ని తీర్చడం ద్వారా ఆ కుటుంబానికి కలిగే ఆనందమే తనకు అసలైన గుర్తింపు అని భావిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

కేసముద్రం మండలంలో ఆపదలో.నేనున్నానంటూ.భరోసా ఇచ్చే వ్యక్తిగా సమ్మయ్య గౌడ్‌ పేరు వినిపిస్తోంది. కష్టాల్లో ఉన్నవారికి కొండంత ధైర్యంగా, కన్నీటి వేళ ఓదార్పుగా నిలుస్తూ సాగుతున్న ఆయన సేవా ప్రస్థానం మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!