ePaper
Friday, July 31, 2026
ePaper
Homeఎడిటోరియల్రాంలీలా మైదానాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

రాంలీలా మైదానాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

📰 Generate e-Paper Clip

రాంలీలా మైదానాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

– బీఆర్ఎస్ శాసనసభాపక్ష విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
➤ సూరారం కాలనీ రాంలీలా మైదానం నూతన కమిటీ సభ్యుల వినతి

➤ నిరుపయోగంగా ఉన్న బోరుకు మోటారు బిగించి విద్యుత్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి

➤ నూతన కమిటీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శికి ఎమ్మెల్యే శాలువాతో సన్మానం

➤ ప్రజలకు ఉపయోగపడే సాంస్కృతిక వేదికల అభివృద్ధికి పూర్తి సహకారం

➤ కమిటీ సభ్యుల సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ

➤ ఈ సమావేశంలో పాల్గొన్న పలు కమిటీ సభ్యులు, నాయకులు

కుత్బుల్లాపూర్, జూలై 30 ( నమస్తే భరత్ ): ప్రజలకు, ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగల నిర్వహణకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న సూరారం కాలనీలోని శ్రీ రాంలీలా మైదానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ శాసనసభాపక్ష విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. 130వ డివిజన్ సుభాష్‌నగర్ పరిధిలోని శ్రీ రాంలీలా మైదానం నూతన కమిటీ కార్యవర్గ సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వారాల వినోద్ ఆధ్వర్యంలో గురువారం పేట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మైదానంలో నిరుపయోగంగా ఉన్న బోరుకు మోటారు బిగించి, విద్యుత్ సదుపాయం కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సమస్యను సానుకూలంగా పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షుడు కొట్టే రవి, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ రవిలను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడే రాంలీలా మైదానాలు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికలుగా నిలుస్తున్నాయని, అలాంటి ప్రదేశాల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు ధారం సాయికుమార్, మాణిక్యరెడ్డి, జాయింట్ కార్యదర్శులు మాసిరెడ్డి, శ్రీనివాస్, కార్యదర్శులు లక్ష్మణ్, గోవిందప్ప, నిర్వహణ కార్యదర్శులు శ్రావణ్ కుమార్, వీరన్న, భాస్కర్ రెడ్డి, సభ్యుడు రంగారావుతో పాటు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!