ePaper
Saturday, August 8, 2026
ePaper
Homeఎడిటోరియల్పశువుల సంరక్షణలో టీకా ఒక్కటే మార్గం

పశువుల సంరక్షణలో టీకా ఒక్కటే మార్గం

📰 Generate e-Paper Clip

పశువుల సంరక్షణలో టీకా ఒక్కటే మార్గం

పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్

ఖానాపురం జూన్ 21 (నమస్తే భారత్ ) : .

పశువుల ఆరోగ్యాన్ని కాపాడటంలో టీకాలు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని,గాలికుంటు, గొంతువాపు, జబ్బవాపు, బ్రుసెలోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి పశువులను రక్షించుకోవడానికి టీకా ఒక్కటే మార్గమని ఖానాపురం మండల పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. ఈసందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ వ్యాధుల నియంత్రణకు గాను టీకాలు వేయడం ద్వారా అంటువ్యాధులు ఒక పశువు నుంచి మరొక పశువుకు సోకకుండా అడ్డుకోవచ్చు. దీనినే ‘మంద రోగనిరోధక శక్తి’ అంటారు. వ్యాధి వచ్చిన తర్వాత పశువైద్యం కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టే కంటే, ముందుగానే టీకాలు వేయించడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకుంటుందని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న పశువులే అధిక పాల దిగుబడిని ఇస్తాయి మరియు సంతానోత్పత్తి సమస్యలు లేకుండా సమర్థవంతంగా పనిచేస్తాయి. దీనివల్ల రైతుకు నేరుగా ఆదాయం పెరుగుతుందన్నారు. ప్రభుత్వ పశువైద్య శాఖ జారీ చేసిన టీకాల షెడ్యూల్ పక్కాగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్న పశువులకే టీకాలు వేయాలి. టీకా వేయించుకున్న వివరాలను ఒక రికార్డులో నమోదు చేసుకోవడం మర్చిపోవద్దు. టీకా వేయించిన సమయం నుంచి కొన్ని రోజుల పాటు పశువులకు తగినంత పోషకాహారం, స్వచ్ఛమైన నీరు అందించి, వాటికి విశ్రాంతినివ్వాలన్నారు.
​గుర్తుంచుకోండి.. ‘టీకా వేయండి – వ్యాధులను అరికట్టండి – పశువుల ఆరోగ్యాన్ని కాపాడండి – తద్వారా రైతు ఆదాయాన్ని పెంచుకోండి’. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని పశువైద్యశాలను సంప్రదించాలని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!