అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఉన్న నిరుపయోగ డబ్బాను వెంటనే తొలగించాలి: డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ
నమస్తే భారత్
నిజాంపేట్ విలేకరి
అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఉన్న నిరుపయోగ డబ్బాను వెంటనే తొలగించాలి: డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ
ప్రగతి నగర్లో అంబేద్కర్ విగ్రహం కనిపించకుండా అడ్డుగా ఉన్న డబ్బాను తొలగించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డిమాండ్
సైబరాబాద్ పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ సర్కిల్, ప్రగతి నగర్లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు గతంలో పోలీసులు ఏర్పాటు చేసిన డబ్బా ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. ఈ డబ్బా కారణంగా అంబేద్కర్ విగ్రహం ప్రజలకు సరిగా కనిపించడం లేదని, అంతేకాకుండా స్థానిక ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ పేర్కొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఉన్న నిరుపయోగ డబ్బాను వెంటనే తొలగించాలని తెలంగాణ ప్రభుత్వానికి, సైబరాబాద్ పరిధిలోని సంబంధిత మున్సిపల్ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అదే విధంగా అంబేద్కర్ విగ్రహం వెనుక ఉన్న మెట్లను విగ్రహం ముందుభాగంలో ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
ప్రజలకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం స్పష్టంగా కనిపించేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యను పరిష్కరించాలని డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ నిర్వహణ కమిటీ నాయకులు కొర్ర రాములు నాయక్ , నిర్వహణ కమిటీ సభ్యులు గోళ్ళ సరయ్య, మోకా భాస్కర్ రావు, దండుగుల స్వామి తదితరులు పాల్గొన్నారు.



