పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ఎంపీడీవో అద్వైత
ఖానాపురం జూన్ 19(నమస్తే భారత్ ) :
ఈనెల 28 పల్స్ పోలియో,జూలై 13 న నేషనల్ డి వార్మింగ్ డే కార్యక్రమాలను సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని
ఎంపీడీవో అద్వైత అన్నారు.
ఖానాపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో
పల్స్ పోలియో ప్రోగ్రాం ,
నేషనల్ డి వార్మింగ్ డే కార్యక్రమాలపై సమావేశం జరిగింది. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా హజరైన ఎంపీడీవో అద్వైత మాట్లాడుతూ పల్స్ పోలియో మరియు నేషనల్ డి వార్మింగ్ డే కార్యక్రమాలను
వైద్య శాఖ అధికారులు సిబ్బంది, ఐసిడిఎస్ అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని కోరారు.మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ పల్స్ పోలియో ప్రోగ్రాం ఈనెల 28 ఆదివారం 0-5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. మండలంలో 25 నిర్దేశిత కేంద్రాలలో
పల్స్ పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.మొదటిరోజు బూత్ లలో రెండవ రోజు,మూడవ రోజు ఇంటింటికి తిరిగి మార్కింగ్ చేస్తారని ,వేయించుకొని పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.
ఐదు సంవత్సరాలు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.జూలై 13 న నేషనల్ డి వార్మింగ్ డే ప్రోగ్రాం జరుగుతుందని
ఖానాపురం మండలంలోని
1 సంవత్సరం నుండి19 సంవత్సరాల బాలబాలికలకు
అంగన్ వాడి సెంటర్స్ , ప్రైమరీ స్కూల్స్ ,హైస్కూల్స్, కళాశాలలో విద్యార్థుల కు
నట్టల నివారణ మాత్రలు
ఆల్బెండజోల్ 400 ఎంజీ మాత్రలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమాలకు ప్రభుత్వ అధికారులు,ప్రజాప్రతినిధులు,
ఉపాధ్యాయులు,అంగన్ వాడీ టీచర్స్ అందరి సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ రమాదేవి,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సయ్యద్ జమీరుద్దీన్ , హెల్త్ సూపర్ వైజర్ దామోదర్ రెడ్డి, దేవిక
ఫార్మసీ ఆఫీసర్ శ్రీనివాసచారి,
ల్యాబ్ టెక్నీషియన్ వేణుగోపాల్ ,వైద్య సిబ్బంది
కనక లక్ష్మి , పరోశిని
విజయ రాణి, విజయ
సునీత, సుజాత, రజిత, జ్యోతి, ప్రతిభ భార్గవి, రమ్య ,
గొడిశాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.



