ePaper
Thursday, July 30, 2026
ePaper
Homeఎడిటోరియల్శంభీపూర్ ప్రభుత్వ కమ్యూనిటీ భవనాన్ని వెంటనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకోవాలి

శంభీపూర్ ప్రభుత్వ కమ్యూనిటీ భవనాన్ని వెంటనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

శంభీపూర్ ప్రభుత్వ కమ్యూనిటీ భవనాన్ని వెంటనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకోవాలి

దుండిగల్ ప్రజావాణిలో ఉప కమిషనర్‌కు ఆకుల సతీష్ బృందం వినతి

-ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనం ఇప్పటికీ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని పరిస్థితి

-గత ఆరు సంవత్సరాల ఆదాయంపై ప్రత్యేక లెక్కల పరిశీలన చేపట్టాలని డిమాండ్

-అక్రమంగా అద్దెలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణకు విజ్ఞప్తి

-చట్టవిరుద్ధంగా వసూలైన మొత్తాలను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సూచన

-ప్రభుత్వ ఆస్తిని స్వాధీనం చేసుకోకపోవడంపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

-పారదర్శక నిర్వహణతో ఐదు వేల రూపాయల అద్దెకు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రతిపాదన

-పేద, మధ్యతరగతి కుటుంబాలకు కమ్యూనిటీ భవనం ఎంతో ఉపయోగపడుతుందని ఆకుల సతీష్ అభిప్రాయం

-ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి

దుండిగల్, జులై 27 ( నమస్తే భరత్): శంభీపూర్ గ్రామంలోని సర్వే నంబరు 181లో ప్రభుత్వ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని వెంటనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆకుల సతీష్ బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఉప కమిషనర్‌కు వినతిపత్రాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ హయాంలో ప్రజల అవసరాల కోసం నిర్మించిన ఈ ప్రభుత్వ కమ్యూనిటీ భవనం గ్రామ పంచాయతీ నుంచి దుండిగల్ పురపాలక సంస్థకు, అనంతరం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనమైనప్పటికీ ఇప్పటికీ అధికారికంగా కార్పొరేషన్ ఆధీనంలోకి రాకపోవడం విచారకరమన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తి కొద్దిమంది ఆధీనంలో ఉండడం సమంజసం కాదని పేర్కొన్నారు. కమ్యూనిటీ భవనాన్ని కొందరు వ్యక్తులు, వారిలో కొందరు రాజకీయ నాయకులు కూడా ఉన్నారనే స్థానిక ఆరోపణల నేపథ్యంలో, వివాహాలు, శుభకార్యాలు, ఇతర సామాజిక కార్యక్రమాలకు అద్దెకు ఇస్తూ ఆదాయం పొందుతున్నారనే అంశంపై సమగ్ర విచారణ నిర్వహించాలని కోరారు. వాస్తవాలు నిర్ధారణైతే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఆరు సంవత్సరాలుగా కమ్యూనిటీ భవనం ద్వారా వచ్చిన ఆదాయంపై ప్రత్యేక లెక్కల పరిశీలన నిర్వహించి, చట్టవిరుద్ధంగా వసూలు చేసిన మొత్తాలను ప్రభుత్వ ఖజానాకు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వ ఆస్తిని ఇంతకాలం స్వాధీనం చేసుకోకపోవడానికి గల కారణాలపై విచారణ జరిపి, పరిపాలనా నిర్లక్ష్యం లేదా బాధ్యతా రాహిత్యం తేలితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమ్యూనిటీ భవనాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం పారదర్శక విధానంలో నిర్వహిస్తూ ఐదు వేల రూపాయల అద్దెతో ప్రజలకు అందుబాటులో ఉంచితే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని ఆకుల సతీష్ పేర్కొన్నారు. వివాహాలు, నామకరణాలు, ఇతర సామాజిక కార్యక్రమాలను తక్కువ వ్యయంతో నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా శంభీపూర్ ప్రభుత్వ కమ్యూనిటీ భవనాన్ని వెంటనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలోకి తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ నిర్వహించి చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆకుల సతీష్ బృందం ఉప కమిషనర్‌ను కోరింది. ఈ కార్యక్రమంలో పి.బి. శ్రీనివాస్, ఎల్ల స్వామి, అంకం సతీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!