ePaper
Friday, July 17, 2026
ePaper
Homeఎడిటోరియల్ముచ్చింతల్ సమతామూర్తి కేంద్రంలో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర

ముచ్చింతల్ సమతామూర్తి కేంద్రంలో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర

📰 Generate e-Paper Clip

ముచ్చింతల్ సమతామూర్తి కేంద్రంలో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర

నమస్తే భరత్, రాజేంద్రనగర్, జులై 16,హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో గల సమతామూర్తి కేంద్రం (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ)లో ఈరోజు (గురువారం) సాయంత్రం శ్రీ జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగ జరిగింది. పరమపూజ్య త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామివారి దివ్య మంగళాశాసనములతో ఈ ఆధ్యాత్మిక వేడుకను నిర్వహించారు.సాయంత్రం 5:30 గంటలకు రథయాత్ర ఎంతో వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలు, దివ్యమైన కీర్తనలు, ఆధ్యాత్మిక సంబరాల నడుమ స్వామివారి పవిత్ర రథోత్సవం సాగింది. లోకకల్యాణార్థం జరిగే ఈ పవిత్రమైన రథయాత్రలో పాల్గొని, జగన్నాథ స్వామివారి దివ్య ఆశీస్సులు అందుకున్నారు , రథాన్ని లాగే అరుదైన భాగ్యాన్ని భక్తులు సద్వినియోగం చేసుకున్నారు.న.భక్తులందరూ తమ కుటుంబసభ్యులతో కలిసి ఈ దివ్య రథయాత్రలో పాల్గొని, స్వామివారి అపారమైన అనుగ్రహానికి పాత్రులైయ్యారు చిన్నజీయర్ స్వామివారి పీఠం భక్తులకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలికింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!