ముచ్చింతల్ సమతామూర్తి కేంద్రంలో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర
ముచ్చింతల్ సమతామూర్తి కేంద్రంలో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర నమస్తే భరత్, రాజేంద్రనగర్, జులై 16,హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో గల సమతామూర్తి కేంద్రం (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ)లో ఈరోజు (గురువారం) సాయంత్రం శ్రీ జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగ జరిగింది. పరమపూజ్య త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామివారి దివ్య మంగళాశాసనములతో ఈ ఆధ్యాత్మిక వేడుకను నిర్వహించారు.సాయంత్రం 5:30 గంటలకు రథయాత్ర ఎంతో వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలు, దివ్యమైన కీర్తనలు, ఆధ్యాత్మిక సంబరాల నడుమ స్వామివారి పవిత్ర రథోత్సవం సాగింది. లోకకల్యాణార్థం జరిగే ఈ...