ePaper
Tuesday, August 11, 2026
ePaper
Homeఎడిటోరియల్కబ్జా కోరుల చేతుల్లో చిక్కి విల విల లాడుతున్న చెరువులు   ఇంతింతై వటుడింతై అన్నట్టుగా...

కబ్జా కోరుల చేతుల్లో చిక్కి విల విల లాడుతున్న చెరువులు   ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతున్న ఆక్రమణలు 

📰 Generate e-Paper Clip

కబ్జా కోరుల చేతుల్లో చిక్కి విల విల లాడుతున్న చెరువులు

ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతున్న ఆక్రమణలు

గతంలో నిపుణులు స్థానికులు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు

చెరువుల సరిహద్దులను గుర్తించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి

నమస్తే భారత్ , రాజేంద్రనగర్, జులై 16, శంషాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో చెరువులు ఆక్రమణలు గురవుతున్నాయని ఆరోపణలు గత కొన్ని నీళ్లుగా వినిపిస్తున్నప్పటికీ పాలకులు అధికారులు ఆ విషయంపై దృష్టి సారించకపోవడంతో ఆక్రమణల పర్వం ఇదేచ్ఛగా సాగుతుందని స్థానికులు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని శంషాబాద్ మండల పరిధిలో చెరువుల ఆక్రమణలు రోజురోజుకు పెరుగుతున్నాయని, పలు గ్రామాల్లోని చెరువుల్లో ఎఫ్ టి ఎల్ పరిధిలో కూడా ఫ్రీ కాస్ట్ లు, ఫెన్సింగ్ లు వేసి మట్టితో నింపుతున్న సందర్భాలు కోకొల్లలుగా దర్శనమిస్తాయని, అధికారులు దృష్టి సారించకపోవడంతోటే ఈ దత్తంగా నడుస్తుందని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
గతంలో వ్యవసాయానికి, తాగునీరుకి, భూగర్భ జలాలకి ఆధారంగా ఉన్న చెరువులు నేడు అగమ్య గోచరంగా మారాయి ప్రస్తుతం చెరువుల స్థానంలో అక్రమ నిర్మాణాలు, మట్టితో నింపి వేయడం, వ్యర్ధాలు పారబోయడం చెరువుల రూపాన్ని కోల్పోతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని చిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ, రషీద్ గూడా, తొండుపల్లి, పాలమాకుల, నర్కుడు తదితర గ్రామాల్లో పలు సందర్భాల్లో చెరువులు ఆక్రమణలు గురవుతున్నాయని, చెరువులను ధ్వంసం చేస్తున్నారని అనేక సందర్బంలో ఫిర్యాదుల అందినప్పటికీ వాటిపై చర్యలు మాత్రం శూన్యం అంటున్నారు. పలుచెరువు ప్రాంతాల్లో ఆక్రమణలు, మురుగునీరుతో నిండడం, నీటి ప్రవాహాల మార్గాలు మూసివేత కారణంగా వరద ముప్పు పెరుగుతోందని స్థానికులు అనేక సందర్భాల్లో తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. విమానాశ్రయం అభివృద్ధి తర్వాత భూములకు విలువ పెరుగుతుండడంతో, ముఖ్యంగా చెరువులు, ప్రభుత్వ భూములపై ఆక్రమణలు పెరిగిపోతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు ఇటీవల ప్రభుత్వ భూములు పై జరిగిన ఆక్రమణలను రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో తొలగించిన సందర్భాలు కూడా లేకపోలేదు. పలు గ్రామాల్లో చెరువులు, కాలువలు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయని,చెరువులను కాపాడుకోలేకపోతే భూగర్భ జలాలు నీటిమట్టం తగ్గిపోవడం, వరదలు, పర్యావరణ అసమతుల్యత వంటి సమస్యలు పెరుగుతున్నాయని, మండల పరిధిలో చెరువుల సరిహద్దులను గుర్తించి శాశ్వతంగా రక్షించే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!