ePaper
Thursday, August 6, 2026
ePaper
Homeఎడిటోరియల్జిల్లా అథ్లెటిక్స్‌లో షాద్ నగర్ ఇండో స్కూల్ విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి ఇద్దరి ఎంపిక

జిల్లా అథ్లెటిక్స్‌లో షాద్ నగర్ ఇండో స్కూల్ విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి ఇద్దరి ఎంపిక

📰 Generate e-Paper Clip

జిల్లా అథ్లెటిక్స్‌లో షాద్ నగర్ ఇండో స్కూల్ విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి ఇద్దరి ఎంపిక

అథ్లెటిక్స్ పోటీల్లో ఇండో స్కూల్ విద్యార్థుల సత్తా

పరుగుల పందెంలో మెరిసిన ఇండో స్కూల్ చిన్నారులు

షాద్ నగర్ ఇండో స్కూల్. చైర్మన్ సాగర్ అభినందన

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 04:రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 1న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో షాద్ నగర్ ఇండో స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారు.అండర్-6 బాలుర విభాగంలో అశ్విత్ చారి 150 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం, 60 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించాడు. అండర్-6 బాలికల విభాగంలో అశికా రెడ్డి 150 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం, 60 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం దక్కించుకుంది. అండర్-10 బాలికల విభాగంలో అలోఖ్య జట్టి 300 మీటర్ల పరుగు పందెంలో మూడో స్థానం సాధించగా, అండర్-8 బాలికల విభాగంలో అస్రా తభస్సుమ్ 200 మీటర్ల పరుగు పందెంలో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.ఈ నెల 7న వరంగల్–హనుమకొండలో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అండర్-6 విభాగంలో అశ్విత్ చారి, అశికా రెడ్డి ఎంపిక కావడం పాఠశాలకు మరో గౌరవంగా నిలిచింది.పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను షాద్ నగర్ ఇండో స్కూల్. చైర్మన్ సాగర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బాంబినో రాజు మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర వికాసానికి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, ప్రతి విద్యార్థి క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయాలతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!