మాజీ ఎంపీటీసీ మేడి ఉపేందర్ మానవరాళ్ల పుష్పలంకరణలో పాల్గొన్న సమ్మిగౌడ్ చిలువేరు

పట్టు వస్త్రాలు అందజేసి చిన్నారులను ఆశీర్వదించిన సమ్మయ్య గౌడ్.సర్పంచ్ బాలాజీ రెడ్డి
నమస్తే భారత్ :-కేసముద్రం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మేడి ఉపేందర్ కోడలు.కొడుకు మేడి అంజలి – శ్రీ మేడి యాకంభ్రం దంపతుల ఆహ్వానం మేరకు, మాజీ ఎంపీటీసీ మేడి ఉపేందర్ మనవరాళ్లు శ్రీనిధి, నిత్యశ్రీల పుష్పాలంకరణ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చిన్నారులను ఆశీర్వదించి, వారు విద్యలో, సంస్కారంలో, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం చిన్నారులకు ఆశీస్సులు అందించి, మేడి కుటుంబ సభ్యులకు పట్టు వస్త్రాలను అందజేసి అభినందనలు తెలిపి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పుష్పాలంకరణ వంటి సాంప్రదాయ కార్యక్రమాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే ఇటువంటి వేడుకలను ప్రతి కుటుంబం ఆదరించి కొనసాగించాలని సూచించారు. చిన్నారులు మంచి విద్యతో పాటు సంస్కారవంతులుగా ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలాజీ రెడ్డి, మాజీ సర్పంచ్ నాగేల్లి శ్రీనివాస్, శ్రీరామ్ రెడ్డి ,మాజీ ఎంపీటీసీ మేడి ఉపేందర్, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు



