ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రజారోగ్య రక్షణే ధ్యేయం. డాక్టర్ గుగులోతు రవి.మరిపెడ పీహెచ్‌సీలో వైద్య అధికారుల కీలక సమీక్ష

ప్రజారోగ్య రక్షణే ధ్యేయం. డాక్టర్ గుగులోతు రవి.మరిపెడ పీహెచ్‌సీలో వైద్య అధికారుల కీలక సమీక్ష

📰 Generate e-Paper Clip

ప్రజారోగ్య రక్షణే ధ్యేయం.

డాక్టర్ గుగులోతు రవి.మరిపెడ పీహెచ్‌సీలో వైద్య అధికారుల కీలక సమీక్ష

నమస్తే భారత్ :-మరిపెడ

స్థానిక మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీహెచ్ వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో అన్ని రకాల ఆరోగ్య కార్యక్రమాలపై గురువారం ఒక సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గుగులోతు రవి మాట్లాడుతూ, వర్షాకాలం నేపథ్యంలో సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్రామాల్లో దోమల ద్వారా, కలుషిత నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల ప్రజలను చైతన్యపరచాలన్నారు.
సమావేశంలోని ముఖ్య నిర్ణయాలు:

* సీజనల్ వ్యాధులపై అవగాహన: మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోధకాలు, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు ప్రబలకుండా ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలి.
* వారానికి రెండు రోజులు డ్రై డే: ప్రతి మంగళవారం, శుక్రవారం నాడు గ్రామస్థాయి అధికారులతో కలిసి ముమ్మరంగా ‘డ్రై డే’ కార్యక్రమాలు చేపట్టాలి.
* వైద్య శిబిరాల నిర్వహణ: ముందస్తు ప్రణాళిక ప్రకారం షెడ్యూల్ రూపొందించి అన్ని గ్రామాలలో వైద్య శిబిరాలు (మెడికల్ క్యాంప్స్ ) నిర్వహించాలి.
* హెచ్‌పీవీ వ్యాక్సిన్: 14-15 సంవత్సరాల వయసు గల బాలికలందరూ తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకునేలా తల్లీదండ్రులకు అవగాహన కల్పించాలి.
* కిశోర బాలికల పరీక్షలు: గ్రామాల్లోని కిశోర బాలికలను (ఆడోల్సేసెంట్ గర్ల్స్ ) గుర్తించి, వారికి అవసరమైన రక్త పరీక్షలు చేయాలి.
* నవదంపతుల సంరక్షణ: కొత్తగా వివాహమైన జంటలను గుర్తించి, వారిలో రక్తహీనత (అనేమియా లోపాన్ని నివారించేందుకు మరియు సురక్షిత ప్రెగ్నెన్సీపై అవగాహన కల్పించాలి.
* టీబీ మరియు దీర్ఘకాలిక వ్యాధుల స్క్రీనింగ్: క్షయ (టీబీ ) వ్యాధి నిర్ధారణ కొరకు స్ఫూటం (కఫం) శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపాలి. 30 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్ పరీక్షలు క్రమం తప్పకుండా.నిర్వహించాలి.ఈ కార్యక్రమంలో డాక్టర్ పూజిత, డాక్టర్ స్వామి, డాక్టర్.కిరణ్.పీహెచ్ఎన్ఓ.మంగమ్మ, సూపర్‌వైజర్లు ఆచార్యులు, మాధవి, పల్లె దవాఖాన సిబ్బంది అఖిల, ఝాన్సీ, అనిత, సౌజన్య, సతీష్, ఉపేంద్ర, సరిత మరియు ఏఎన్ఎంలు ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు.పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!