ePaper
Saturday, August 8, 2026
ePaper
Homeఎడిటోరియల్ఫీజు బకాయిల విడుదలకు బీజేపీ యువమోర్చా ఉద్యమ శంఖారావం

ఫీజు బకాయిల విడుదలకు బీజేపీ యువమోర్చా ఉద్యమ శంఖారావం

📰 Generate e-Paper Clip

ఫీజు బకాయిల విడుదలకు బీజేపీ యువమోర్చా ఉద్యమ శంఖారావం

-“ఫీజు బకాయి – బీజేపీ లడాయి” రాష్ట్రవ్యాప్త ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణ

-కుత్బుల్లాపూర్‌లో బీజేపీ, బీజేవైఎం నాయకుల సంఘీభావం

-ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్

-విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ప్రభుత్వానికి హెచ్చరిక

-విద్యార్థుల హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం

-పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొని పోస్టర్ ఆవిష్కరణ

కుత్బుల్లాపూర్, జులై 24 ( నమస్తే భరత్): తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా (BJYM) రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” ఉద్యమానికి మద్దతుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శుక్రవారం పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బీజేపీ, బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ, వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలిగించే పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నివారించి, పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని, వారి హక్కుల పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా నిరంతరం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తాయని స్పష్టం చేశారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డా. ఎస్. మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి, మూగ జయశ్రీ, నందనం దివాకర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శంకర్ రెడ్డి, బీజేపీ స్టేట్ టీచర్స్ సెల్ కో-కన్వీనర్ సుమన్ రావు, శేఖర్ యాదవ్, భరత్ సింహా రెడ్డి, నరేంద్ర చౌదరి, జిల్లా కార్యవర్గ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఉద్యమానికి తమ మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని బీజేవైఎం నాయకులు నాగదీప్ గౌడ్, రావుల పృథ్వి, సాయి కృష్ణ, శ్యామ్ కిరణ్ రెడ్డి, యశ్వంత్ విజయ్, ఆర్థిక్ యాదవ్, మంజునాథ్, శ్రీనాథ్, పవన్, మహిళా మోర్చా నాయకురాలు అరకల సుధ ఆధ్వర్యంలో నిర్వహించారు.
విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ, బీజేవైఎం నాయకులు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!