ePaper
Friday, September 11, 2026
ePaper
Homeతెలంగాణఅధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం రైతు వేదికలు..! -జిల్లా అధికారుల స్పందించాలి..

అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం రైతు వేదికలు..! -జిల్లా అధికారుల స్పందించాలి..

📰 Generate e-Paper Clip

అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం రైతు వేదికలు..!

-జిల్లా అధికారుల స్పందించాలి..

-సిపిఐ(ఎం) మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్

 

నమస్తే భారత్ :-మరిపెడ

 

వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం రైతు వేదికలు, రైతు వేదిక శిథిల వ్యవస్థలోకి చేరి, నిరుపయోగానికి గురవుతుండగా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్య వదిలేయడం బాధాకరమని సిపిఐ(ఎం) మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ అన్నారు. ఆదివారం అబ్బాయిపాలెం గ్రామ శివారు పత్తికుంటతండా నిర్మించిన రైతు వేదికను వారు సందర్శించారు. ఈ తండ పక్కన ఉన్న రైతు వేదికను పరిశీలించారు. అక్కడ రైతులు తెలిపిన ఆధారంగా అబ్బాయిపాలెం, అమృ నాయక్ తండ, ధారావత్ తండా, గాలి వారి గూడెం గ్రామపంచాయతీలతో పాటు, మరిపెడ మున్సిపాలిటీకి చెందిన సుమారు 5000 మంది రైతులకు ఉపయోగపడే మరిపెడ క్లస్టర్ రైతు వేదిక అబ్బాయి పాలెం లో నిర్మాణం చేపట్టారు. దీనిని గత బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సుమారు 23 లక్షలు ఖర్చు చేసి నాసిరకంగా నిర్మించి చేతులు దులుపుకున్నారు. అవినీతి అక్రమాలకు అధికారుల నిర్లక్ష్యానికి రైతు వేదికలుగా నిలిచాయని మధు ఆరోపించారు. గత రెండు సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలకు సందర్భంగా చెరువు అలుగు వరద తాకిడికి రైతు వేదిక బయట ప్రాంతంలో పాక్షికంగా దంసమైందన్నారు. గతంలో రెండు మూడు దఫాలుగా మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకుపోయిన కనీసం వారు పట్టించుకోలేదని మధు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కళ్ళు తెరిచి దీని మైనరు రిపేరు చేసి రైతులకు ఉపయోగపడే విధంగా చూడాలని ఆయన అధికారులను కోరారు. లేనియెడల సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే విధంగా రైతులను సమీకరించి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) మండల నాయకులు బాణాల రాజన్న, గ్రామ శాఖ కార్యదర్శి కొండ ఉప్పలయ్య, నాయకులు ఎర్ర వెంకన్న, సైదులు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!