ePaper
Monday, July 6, 2026
ePaper
Homeఎడిటోరియల్కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక బిజెపి పాలన మార్పు కై తిరుగుబాటు,  సెప్టెంబర్ 1 న...

కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక బిజెపి పాలన మార్పు కై తిరుగుబాటు,  సెప్టెంబర్ 1 న చలో ఢిల్లీ

📰 Generate e-Paper Clip

కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక బిజెపి పాలన మార్పు కై తిరుగుబాటు, సెప్టెంబర్ 1 న చలో ఢిల్లీ

రామ్ లీలా మైదానంలో లక్షలాదిమందితో బిజెపి మోడీ ప్రభుత్వ మార్పు కై భారీ నిరసన ఆందోళన జయప్రదం చేయండి సిపిఐ జిల్లా కార్యదర్శి బి .విజయ సారధి పిలుపు

నమస్తే భారత్ :-తొర్రూర్

తొర్రూర్ మండల కేంద్రంలో జరుగుతున్న సిపిఐ మహబూబాబాద్ జిల్ల రాజకీయ సైదాంతిక శిక్షణా తరగతులను 2 వ రోజు సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ కేంద్ర బిజెపి మోడీ సర్కార్ అవలంబిస్తున్న కార్మిక ప్రజాకర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మోడీ ప్రభుత్వ మార్పు కోసం బిజెపి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి సెప్టెంబర్ 1న లక్షలాది మందితో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించ తలపెట్టినామని రామ్ లీలా మైదానంలో లక్షలాదిమంది తో భారీ నిరసన ఆందోళన జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మోడీ 12 ఏళ్ల పాలనలో దేశం వెనక్కి పోయిందన్నారు మోడీ అంబానీ ఆదానీలకే 12 ఏళ్ల కాలం పాటు పని చేశాడని దేశంలో ఏ ఒక్కరికి మోడీ చేసిందేమీ లేదన్నారు దేశంలో మోడీ పాలనలో పేదరికం పెరిగిపోయిందని నిరుద్యోగం.పెరిగిపోయిందన్నారు ఇటు కార్మికులను ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ నడ్డి విరుస్తున్నాడు అన్నారు నల్ల చట్టాలను తీసుకువచ్చి కార్మికులను మోసం చేశాడన్నారు దేశంలో 140 కోట్ల మంది ప్రజలు మోడీపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధమైనారని సెప్టెంబర్ 1న రామ్ లీలా మైదానంలో మోడీపై ఇక తిరుగుబాటు తప్పదని పిలుపునిచ్చారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరీ చేయాలన్నారు సిపిఐ బలోపేతానికి శిక్షణ శిబిరాలు తోడ్పడతాయని రానున్న కాలంలో జిల్లాలో ప్రజా సమస్యలపై మిలిటెంట్ ఉద్యమాలు చేస్తామని పిలుపునిచ్చారు
అనంతరం నేడు వివిధ అంశాలపై సింగు నరసింహారావు శంకర్ నారాయణ జితేందర్ రెడ్డి విజయసారథి ప్రతినిధులకు క్లాసులు బోధించారు
శిక్షణా తరగతులలో సిపిఐ మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తమ్మెర విశ్వేశ్వరరావు సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి అజయ్ సారధి రెడ్డి నల్లు సుధాకర్ రెడ్డి.కట్టెబోయిన శ్రీనివాస్, ఓమా బిక్షపతి,బందు మహేందర్,కిరణ్, లక్ష్మణ్, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, మామిండ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగ చారి, వరిపల్లి వెంకన్న,నెల్లూరు నాగేశ్వరరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు ప్రతినిధులు వివిధ మండలాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!