*జనాభా ప్రాతిపదికన బీసీలకు* *రిజర్వేషన్లు కల్పించాలి*
*పల్నాటి యాదయ్య*
నమస్తే భారత్ షాద్ నగర్,నవంబర్03:బిసి హక్కుల సాధన సమితి కొందుర్గు జిల్లేడు చౌదరిగుడా మండలాల ముఖ్యకార్యకర్తల
సమావేశం రామచంద్రపూర్ లో కాళపూరం బాల్ రాజ్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిసి హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్నాటి యాదయ్య మాట్లాడుతు భారతదేశంలో 50శాతం ఉన్న బీసిలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం అని విమర్శించారు వెంటనే జన కులగణన చేపట్టి బీసీ లందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు షెడ్యూల్ జీఓ నెంబర్ 9ప్రకారం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి అని కోరారు కొన్ని కులాలకు నేటికీ కులవివక్ష అంటరానితనం ఉందన్నది అని ఆవేదన వ్యక్తం చేశారు
బీసీలలో అట్టడుగు వర్గాలు సంచార జాతులు అనేకం ఉన్నాయని కూడు గూడు గుడ్డ సమాజంలో గౌరవం నోచుకోకపోవడం కడుసోచినీయమని అన్నారు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బిసిడిక్లరేషన్ బహిరంగ సభ పెట్టి బీసీల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి నేడు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు ఇకనైనా ప్రభుత్వాలు 50 శాతం ఉన్న జనాభా ప్రాతిపదికన బీసీ లందరికీ తగిన ప్రాధాన్యత ఇచ్చి బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన మంత్రివర్గంలో బీసి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి కోసం తోడుపాటి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాలను కోరారు లేనియెడల బీసీలు అందరూ ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తిరగబాటు తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బి కే ఎం యు జిల్లా
ప్రధాన కార్యదర్శి
బుద్ధుల జంగయ్య
సిపిఐ జిల్లేడు చౌదరిగుడా మండల కార్యదర్శి
జిల్లెల్ల వెంకటేష్, కొందుర్గు మండల కార్యదర్శి
భాగళ నరసింహ పాల్గొన్నారు
ఈ సందర్భంగా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది కొందుర్గు మండల అధ్యక్షులుగా సత్యనారాయణ మండల ఉపాధ్యక్షులు యాదమ్మ మండల ప్రధాన కార్యదర్శి భూపాల్ మండల సహాయ కార్యదర్శి ఎం మల్లేష్ కోశాధికారి సి సురేష్
జిల్లేడు చౌదరిగుడా నూతన కమిటీ అధ్యక్షులుగా ఎస్ భాస్కర్ ప్రధాన కార్యదర్శిగా కాళ్ళ పురం బాలరాజు యాదవ్ ఉపాధ్యక్షులుగా యాదయ్య కార్యదర్శిగా వీరేశం కోశాధికారిగా కే మల్లేష్ తో పాటు మరో పదకొండు మందిని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటయ్య శంకరయ్య రాములు తదితరులు పాల్గొన్నారు.



