తండ్రి లేని బాలుడి చదువుకు ‘రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ’ చేయూత
వరంగల్, నవంబర్ 3 (నమస్తే భారత్ ): తండ్రిని కోల్పోయిన నిరుపేద విద్యార్థి చదువుకు రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకుంది. వరంగల్‌లోని లిటిల్ మాస్టర్ హైస్కూల్లో మొదటి తరగతి చదువుతున్న కొంగ అరుష్ వార్షిక విద్యా ఫీజు రూ.15,000లను క్లబ్ సభ్యులు స్వయంగా చెల్లించి తమ ఉదారతను చాటుకున్నారు.
కోవిడ్ సమయంలో భర్తను కోల్పోయిన బాలుడి తల్లి కొంగ చందన తన కుమారుడి చదువుకు ఆర్థిక సహాయం అందించాలని రోటరీ క్లబ్‌ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన క్లబ్ సభ్యులు వెంటనే బాలుడి విద్యా ఫీజును చెల్లించి కుటుంబానికి అండగా నిలిచారు.



