ePaper
Friday, June 19, 2026
ePaper
Homeఎడిటోరియల్నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

📰 Generate e-Paper Clip

నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

నమస్తే భారత్ :-తొర్రూరు

నాణ్యమైన వైద్య సేవలను స్థానికులు అందించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.పట్టణంలో డాక్టర్ శ్రీనివాస్ ఆర్థోపెడిక్ అండ్ జనరల్ హాస్పిటల్ ను డాక్టర్ పి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ శ్రీనివాస్ గ్రామీణ మరియు పట్టణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఆధునిక వైద్య సదుపాయాలతో కూడిన ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.ప్రజలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నిపుణుల వైద్య సేవలు పొందగలరని పేర్కొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను ఎమ్మెల్యే పరిశీలించి,వైద్య సిబ్బందితో మాట్లాడి అందిస్తున్న సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు.ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ఆసుపత్రి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్,సీనియర్ నాయకులు డాక్టర్ పోనుగోటి సోమేశ్వర్ రావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,మాజీ మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, కౌన్సిలర్లు ముద్దసాని సురేష్, వైద్యులు,ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైద్యులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!