ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో అలుపెరుగని సంఘం పిఆర్టీయూ.
పిఆర్టీయూ సభ్యత్వ నమోదులో
పిఆర్టీయూ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మిర్యాల సతీశ్ రెడ్డి
నమస్తే భారత్ :-తొర్రూర్
తొర్రూర్ మండలం లో జరిగిన పిఆర్టీయూ సభ్యత్వ నమోదులో
పిఆర్టీయూలో సభ్యత్వమే ఒక వరం అని,ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో అలుపెరుగని కృషి చేస్తున్న సంఘం పిఆర్టీయూ అని పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు శ్రీ మిర్యాల రెడ్డి, అన్నారు. పిఆర్టీయూ సభ్యత్వ నమోదులో ప్రధాన కార్యదర్శి పులి ముత్తిలింగం నేతృత్వంలో భాగంగా మండలం లో పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదులో భాగంగా వారు మాట్లాడుతూ పిఆర్టీయూ సంఘం ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తుంది అన్నారు. ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న అపరిష్కృత సమస్యలను పరిష్కరించే వరకు పీఆర్టీయూ సంఘం అలుపెరుగని పోరాటం చేస్తుంది అన్నారు.ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ రాష్ట్ర బాధ్యులు దుబ్బాక శ్రీధర్ రెడ్డి,జిల్లా బాధ్యులు కొల్లూరు అశోక్, గునిగంటి శ్రీనివాస్ ,దర్గా హుస్సేన్ , రవీందర్, మరియు కొత్త చంద్ర శేఖర్ రెడ్డి, సుమన్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



