ePaper
Monday, August 3, 2026
ePaper
Homeఎడిటోరియల్జీవవైవిధ్యాన్ని కాపాడడంలో మొక్కల పాత్ర కీలకం

జీవవైవిధ్యాన్ని కాపాడడంలో మొక్కల పాత్ర కీలకం

📰 Generate e-Paper Clip

జీవవైవిధ్యాన్ని కాపాడడంలో మొక్కల పాత్ర కీలకం

సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు

ఖానాపురం ఆగష్టు3 (నమస్తే భారత్ ) :
ప్రకృతి సమతుల్యతలో మొక్కలు ప్రాణవాయువును అందించడం, కాలుష్యాన్ని తగ్గించడం, జీవవైవిధ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంగళవారిపేట గ్రామ సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు అన్నారు.
ఖానాపురం మండలం మంగళవారిపేట ఊర కుంట చెరువు కట్టపై ఈత మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారిపేట గ్రామ సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మొక్కలు భూమిపై సమస్త జీవకోటికి ఆహారాన్ని, ఆశ్రయాన్ని ఇస్తూ పర్యావరణాన్ని స్థిరంగా ఉంచుతాయన్నారు.రాబోయే రోజులలో ప్రకృతి నుండి వచ్చే ఆరోగ్యకరమైన కల్లు అందుబాటులో ఉండడానికి , గౌడ కులస్తులకు ఉపాధి కల్పించుట కొరకు ఈత మొక్కలు వి. బి .జి .రామ్ పథకం కూలీలతో చెరువు కట్టపైన నాటించడం జరిగిందన్నారు. ఈత మొక్కలు నాటడం వల్ల ప్రకృతిని కాపాడినవారమవుతాం అదే సమయంలో ప్రకృతి ప్రసాదించిన కల్లు లభ్యమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ భూష బోయిన రాజు , తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి
గొంది నాగేశ్వరరావు , కారోబార్ పోసాని ఐలుమల్లు ఫీల్డ్ అసిస్టెంట్ పులిగిల్ల శ్రీశైలం, వార్డు మెంబర్ గొంది నరసయ్య , అందె విజయ్, కూలీలు రాగం ఐలయ్య, మచ్చ ముత్తయ్య,రాగం కొమురయ్య మాచర్ల సోమలత ,పులిగిల్ల సప్న, నానబోయిన గంగమ్మ, బుర్కా దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!