ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeఎడిటోరియల్సిద్దాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న హీరో మహేష్ బాబుకు డంపింగ్ యార్డు విషయమై ముఖ్యమంత్రి దృష్టికి...

సిద్దాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న హీరో మహేష్ బాబుకు డంపింగ్ యార్డు విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రద్దు అయ్యే విధంగాకృషి చేయాలని ఏ మెయిల్ మరియు వాట్సాప్ ద్వారా విజ్ఞప్తి చేసిన పినపాక ప్రభాకర్

📰 Generate e-Paper Clip

సిద్దాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న హీరో మహేష్ బాబుకు డంపింగ్ యార్డు విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రద్దు అయ్యే విధంగాకృషి చేయాలని ఏ మెయిల్ మరియు వాట్సాప్ ద్వారా విజ్ఞప్తి చేసిన పినపాక ప్రభాకర్.

శ్రీయుత మహేష్ బాబు గారికి,
హైదరాబాద్.

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 13:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో ఏకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డు ను ఏర్పాటు చేయడం కోసం 86 ఎకరాల భూమిని జీహెచ్ఎంసీ కి బదలాయిస్తూ జీవో ఆర్టీ నెంబర్ 641ని తీసుకువచ్చింది.
సిద్దాపూర్ గ్రామం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ ప్రాంతం కూరగాయల ఉత్పత్తికి ప్రసిద్ధి. జిల్లాలో ఎక్కడా లేని పశు సంపద ఈ ప్రాంతం యొక్క సొత్తు, ఇక్కడి ప్రజానీకం వ్యవసాయం మరియు పాడి సంపద మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ప్రాంతంలో అమెజాన్, నాట్కో, ఎమ్ఎసెన్, మైక్రోసాఫ్ట్, పోకర్న లాంటి పేరెన్నిక గల భారీ పరిశ్రమలు ఉన్నాయి. ముస్లీంలు మరియు హిందువులు పవిత్రంగా భావించే జహంగీర్ పీర్ దర్గా అలానే అనేక ప్రాచీన దేవాలయాల పవిత్రతకు ఈ డంపింగ్ యార్డు వలన భంగం వాటిల్లుతుంది. ఈ డంపింగ్ యార్డు ఏర్పాటు వలన విపరీతమైన దుర్వాసనతో పాటు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి, ఆర్ధిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాలు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. చెత్తనుండి విడుదలయ్యే విషపూరిత ద్రవం (లీచెట్) భూమిలోని భూగర్భ జలాలను కలుషితం చేస్తుంది. చెత్త కుళ్ళడం వల్ల మీథేన్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజెన్ సల్ఫేట్ లాంటి వాయువులు విడుదల అవుతాయి. ఈ వాయు కాలుష్యం వల్ల శ్వాస కోశ సమస్యలు అస్తమా, అలర్జీలు, చర్మ వ్యాధులు సంభవిస్తాయి. వాతావరణంలో మార్పులకు దోహదం చేస్తాయి. మిథిన్ వాయువు వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉంది.
అంతే కాకుండా ఈ కలుషిత నీరు ఈ ప్రాంతంలో ఉండే గొలుసుకట్టు చెరువుల గుండా హైదరాబాద్ కు తాగు నీరు అందించే హిమాయత్ సాగర్ లో కలుస్తుంది. సుమారు 20 లక్షల మంది ప్రజలు ఈ నీరు తాగి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక పక్క మూసి సుందరీకరణ పేరుతో కాలుష్యాన్ని తగిస్తాం అంటూనే మళ్ళా ఈ కాలుష్య నీటిని మూసిలోకే వదలటం అంటే సుందరీకరణకు అర్థం లేకుండా పోతుంది. విమానాశ్రయం దగ్గర ఉండటం వల్ల ఈ డంప్ యార్డు కు వచ్చే పక్షుల తో విమానాలకు ప్రమాదాలు జరిగే ఆస్కారం లేకపోలేదు.. ఈ ప్రతిపాదిత డంప్ యార్డు ప్రాంతంలో భూగర్భ గ్యాస్ లైన్ కోడా ఉండటం భారీ ప్రమాదాలకు నిలయంగా కూడా మారవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పడిపోయే అవకాశం ఉంది. భవిషత్ తరాలకు స్వచ్చమైన గాలి, నీరు , ఆహారం లభించటం కష్టమవుతుంది.
మీరు ఈ సిద్దాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుని అనేక రకాలుగా అభివృద్ధి పదంలో నడిపించారు. ఈ డంపు యార్డు రావడం వలన ప్రస్తుతం ఈ గ్రామంతో పాటు చుట్టు పక్కల సుమారు 50 గ్రామాల ప్రజల జీవన విధానం పై ప్రభావం చూపుతుంది.
కావునా మీరు మానవతా దృక్పథంతో ఈ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ డంపు యార్డు ను రద్దు చేయాలని, జీవో ఆర్టీ నెంబర్ 641 ను వెనక్కి తీసుకోనెలా మీ వంతు కృషి చేయాలని కోరుతున్నాము. ఇట్లు .పినపాక ప్రభాకర్, కన్వీనర్
సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ ఫోన్: 9396311873

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!