ePaper
Friday, September 18, 2026
ePaper
Homeఎడిటోరియల్బీజేపీ విధానాలకు ప్రజలు గట్టిగా సమాధానం చెప్పాలి

బీజేపీ విధానాలకు ప్రజలు గట్టిగా సమాధానం చెప్పాలి

📰 Generate e-Paper Clip

బీజేపీ విధానాలకు ప్రజలు గట్టిగా సమాధానం చెప్పాలి

-యువత వాముపక్ష రాజకీయాల్లోకి రావాలి

-గుండెపుడి నుండి
బైక్ ర్యాలీ ప్రారంభం

-సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య,

నమస్తే భారత్ :-మరిపెడ

బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని, యువత వామపక్ష రాజకీయాల్లోకి రావాలని సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య అన్నారు. బుధవారం సిపిఐ(ఎం) మరిపెడ మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీనీ గుండెపూడి గ్రామంలో వీరయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గుండెపూడి, బురహాన్ పురం, తానంచర్ల, తాళ్ల ఉక్కల్, వెంకంపాడు, బావోజి గూడెం, రాంపురం, చిల్లంచర్ల, ఆనేపురం, ఎల్లంపేట, వీరారం, అబ్బాయి పాలెం, మరిపెడ (బంగ్లా) బైక్ ర్యాలీ ద్వారా వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాట వారోత్సవాల ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు. 1948 సెప్టెంబర్ 17 నాటి వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిందని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా, ఆంధ్ర మహాసభ నాయకత్వంలో నాలుగువేల గ్రామాలను భూస్వాముల శిరసాలల నుండి విముక్తి అయిందని వీరయ్య పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో వేలాదిమంది కమ్యూనిస్టులు ప్రాణ త్యాగాలు చేశారన్నారు. అందులో దొడ్డి కొమరయ్య, బందగి , చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, భీమిరెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణరెడ్డి, సుందరయ్య లాంటి వీరయోధులు ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనటం జరిగిందన్నారు. నేడు సాయిధ పోరాటానికి సంబంధం లేని బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు తెలంగాణ విమోచన దినమని తప్పుడు ప్రచారంతో తెలంగాణ వారోత్సవాలను వక్రీకరించే కుట్రలు చేయటాన్ని ప్రజలు సహించరని వీరయ్య స్పష్టం చేశారు. అంతేగాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి ప్రజలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలకు సరైన బుద్ధి చెప్పాలంటే నేటి యువతరం వామపక్ష రాజకీయాల్లోకి ప్రత్యక్ష ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్, మండల నాయకులు బాణాల రాజన్న , జిన్న లచ్చయ్య, బోడపట్ల రాజశేఖర్, కందాల రమేష్, నాయకులు అల్లి శ్రీనివాస్ రెడ్డి, షరీఫ్, నల్లబోలు లక్ష్మారెడ్డి, వీరింకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!