ePaper
Sunday, July 5, 2026
ePaper
Homeఎడిటోరియల్డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో భారీ అక్రమాలు సమగ్ర విచారణ జరపాలి పానుగంటి పర్వతాలు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో భారీ అక్రమాలు సమగ్ర విచారణ జరపాలి పానుగంటి పర్వతాలు

📰 Generate e-Paper Clip

*డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో భారీ అక్రమాలు సమగ్ర విచారణ జరపాలి పానుగంటి పర్వతాలు*

*అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మఇండ్లుకట్టించాలి*
*బుద్ధుల జంగయ్య*

*ఆర్డీవో ఎస్ ఆర్ సరిత కి వినతి పత్రం అందజేసిన సిపిఐ నాయకులు*

నమస్తే భారత్ షాద్ నగర్ జులై 1 డబ్బులు బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగాయని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు ఆరోపించారు ఈ సందర్భంగా షాద్నగర్ ఆర్డిఓ కార్యాలయం ముందల రాష్ట్ర సమితి పిలుపుమేరకు ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు
బుద్ధుల జంగయ్య
అధ్యక్షత వహించగా పానుగంటి పర్వతాలు మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని ఈ అక్రమాలు అధికారులకు రాజకీయ నాయకులకు తెలియకుండానే జరిగాయా అని ఆయన ప్రశ్నించారు గతబిఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు నిర్మించడంలో కూడా అక్రమాలు జరిగాయని ప్రజలకు అందుబాటులో లేని జాగలో ఇండ్లు నిర్మించారని 10 ఏళ్ల పాలనలో ఇండ్లు పంపిణీ చేయకుండా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని అందుకే బీఆర్ఎస్ ను దించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలకు నిజమైన పేదలకు ఇండ్లు పంపిణీ చేయకుండా అక్రమాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం
అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ అక్రమాలపై ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తేజాల్చిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు ఆర్డిఓ ఆఫీస్ లో కూడా రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని నిరుపేదల పనులు జరగకుండా అడ్డుపడుతున్నారని మా దృష్టికి వచ్చిందని అన్ని మాకు తెలిసే జరగాలని ఆర్డీవో కార్యాలయ అధికారులకు అధికార పార్టీ నాయకులు హుకుం జారీ చేశారని ఇదెక్కడి పరిపాలన అని ఆయన ప్రశ్నించారు ప్రజా పాలన అంటే ఇదేనా అని ఆయన అన్నారు రాజకీయ నాయకుల తీరు మారకపోతే రెవెన్యూ అధికారులు ప్రజల పనులు చేయకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులుబుద్దుల జంగయ్య మాట్లాడుతూ కొందుర్గు మండలం ఎనెగడ్డలో సర్వేనెంబర్ 237లో అప్పటి ప్రభుత్వం 2008లో ఇండ్ల పట్టాలు పంచిందని కానీ పొజిషన్ చూయించలేదని వెంటనే పొజిషన్ చూయించి అక్కడే ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని ఆయన అన్నారు చౌదర్ గూడా మండల కేంద్రం లో సర్వేనెంబర్ 142లో 42 మందికి పట్టాలు తయారు చేశారు కానీ పంపిణీ చేయలేదు పొజిషన్ చూయించలేదు వెంటనే పట్టాలు పంచి పొజిషన్ చూయించి ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు
కేశం పేట మండలం వేములనర్వ గ్రామంలో సర్వే నెం232.234 నక్ష బాట ను అలాగే సర్వేనెం272.317 రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని చెరువును కూడాఒక ప్రైవేటు వెంచర్ భూవాక్రమణకు పాల్పడితే సోషల్ మీడియాలో పత్రికలలో వచ్చిన కూడా రాజకీయ నాయకులు రెవెన్యూ అధికారులు అంతిముట్ట నట్టు వ్యవహరించడంలో ఉద్దేశం ఏంటి సమాధానం చెప్పాలన్నారు ప్రభుత్వం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను కాపాడటానికి చేయడానికి ఆయన త్రివిధ స్థాయిలో మండిపడ్డారు రెవెన్యూ అధికారుల తీరు మారకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్స్ వెంటనే ఇవ్వాలని ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల ఇస్తామన్న ఎన్నికల హమిని నిలబెట్టుకుని వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని ఆయన అన్నారు అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించడంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుందని నిజమైన పేదలు అరులైన లబ్ధిదారులు అనేకమంది ఇందిర ఇండ్లు మంజూరు కాక ఎదురుచూస్తున్న పరిస్థితు ఉందని ఆయన ఆర్డిఓ దృష్టికి తీసుకువచ్చారు వెంటనే వారందరి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి జాగ లేనివారికి 60 గజాల జాగా కేటాయించి ఇండ్లు కట్టించి వాలని ఆయన డిమాండ్ చేశారు పలు డిమాండ్లతో కూడిన విన్నది పత్రాన్ని ఆర్డిఓ సరిత గారికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లేడు చౌదరిగుడా సిపిఐ మండల కార్యదర్శి జిల్లెల్ల వెంకటేష్ కొత్తూరు మండల కార్యదర్శి ఎండి షకిల్ కేశంపేట మండల కార్యదర్శి గోవిందు నాయక్ జిల్లేడు చౌదరిగుడా మండల సహాయ కార్యదర్శి ఎండి షబ్బీర్ ఫరూక్నగర్ మండల సహాయ కార్యదర్శి రమేష్ యాదవ్ సిపిఐ నాయకులు జి యాదయ్య యాదగిరి ఎల్లయ్య మైసయ్య మైబూబ్ మస్రుద్ షబ్బీర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బాధితులు ఇందిరమ్మ ఇండ్ల బాధితులు ఇండ్ల స్థలాల బాధితులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!