బండ్లగూడ జాగీర్‌లో వైభవంగా శ్రీ వానదేవత సహిత కాటంరాజు విగ్రహ ప్రతిష్టోత్సవo
ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్
నమస్తే భారత్ , రాజేంద్రనగర్, జులై 03,బండ్లగూడ జాగీర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వానదేవత సహిత కాటంరాజు స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుపుకున్నారు . ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాజేంద్రనగర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ అనంతరం భక్తులను గౌడ సంఘం సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ . మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ, భావితరాలకు అందించడంలో బండ్లగూడ జాగీర్ గౌడ సంఘం చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. శ్రీ కాటంరాజు వానదేవతల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. గౌడ సామాజిక వర్గ అభివృద్ధికి, వారి సంక్షేమానికి తన వంతు సహకారం, ప్రభుత్వ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం గౌడ సంఘం నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



