ePaper
Tuesday, September 15, 2026
ePaper
Homeతెలంగాణమతసామరస్యం వెళ్లి విరిసే విధంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలి

మతసామరస్యం వెళ్లి విరిసే విధంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలి

📰 Generate e-Paper Clip

మతసామరస్యం వెళ్లి విరిసే విధంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలి

పత్తికుంట చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అధికారులు

నమస్తే భారత్ , రాజేంద్రనగర్, సెప్టెంబర్ 12, రాజేంద్రనగర్ పరిధిలోని పత్తికుంట చెరువు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో ఆయన వెంట జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. నిమజ్జనం సాఫీగా జరిగేలా చెరువు వద్ద ఏర్పాటు విద్యుత్ దీపాలు (లైటింగ్), బారికేడ్ల సదుపాయాలను అధికారులు ఎమ్మెల్యే కి వివరించారు.నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బల్దియా, పోలీస్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదేశించారు. ముఖ్యంగా పారిశుధ్య పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
భారీ సంఖ్యలో విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన భద్రతా చర్యలు, గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ శాఖల సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!