ePaper
Friday, July 3, 2026
ePaper
Homeఎడిటోరియల్మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సంఘం ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి

నమస్తే భారత్, రాజేంద్రనగర్, జులై 02, మున్సిపల్ చైర్మన్ మైలారం లింబాద్రి మున్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ని శాలువా కప్పి సన్మానించారు .మెట్ పల్లి మున్సిపల్ పరిధిలో పనిచేసే కార్మికుల సమస్యల పరిష్కరించాలనిఈ రోజు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ & కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారం లింబాద్రిని కలిసి వినతి పత్రం అందజేశారు . మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ ని కలిసి కార్మికుల సమస్యల పై అధికారులను కలిశారు.

ఈ సందర్భంగా వనంపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని. 60 సంవత్సరాలు పైబడిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం ఇవ్వాలని అన్నారు.2016 సంవత్సరంలో కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి మున్సిపల్ అధికారులు కార్మికులకు క్యాజువల్ లీవులు, పండుగ సెలవులు, మహిళా కార్మికులకు 120 రోజుల ప్రసూతి సెలవులు అమలు చేస్తామని తేది:16/07/2016 నాడు సర్కులర్ నెంబర్: 741/2014 /M2 -2 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, మరియు అన్ని విభాగాల్లో పనులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులందరికీ అమలు చేస్తామని రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్మికులందరికీ సబ్బులు, నూనెలు, చెప్పులు, డ్రెస్సులు, అన్ని అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. నేటికీ మెట్ పల్లి మున్సిపల్ పరిధిలో అమలు కాకపోవడం విడ్డూరంగా ఉంది అన్నారు. చైర్మన్, మున్సిపల్ కమిషనర్ మా పరిధిలో ఉన్నటువంటి అన్ని అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి ఎండి ఉస్మాన్, జిల్లా అధ్యక్షులు బర్ల లక్ష్మణ్, మెట్పల్లి పట్టణ అధ్యక్షులు లంక శ్రీకాంత్, ఉల్లెందుల శ్రీను అంతడుపుల అనిల్, లంక సంజీవ్, వాల్గోట్ నరేష్, డి అశోక్ అలాగే 13వ వార్డు కౌన్సిలర్ గుడికందుల అజయ్, మైలారపు రాము తదితర నాయకులు కార్మికులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!