ePaper
Tuesday, September 22, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ డా. సత్య శారద

ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ డా. సత్య శారద

📰 Generate e-Paper Clip

ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

జిల్లా కలెక్టర్ డా. సత్య శారద

వరంగల్ ఆగస్టు 12(నమస్తే భారత్ ) :

ఎంజీఎం ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద బుధవారం సందర్శించి ఆస్పత్రిలోని కంప్లైంట్ బాక్స్‌ను పరిశీలించారు. అనంతరం వివిధ వార్డులను సందర్శించి రోగులతో నేరుగా మాట్లాడి వైద్యం అందుతున్న తీరుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సమస్యలపై వివరాలను తెలుసుకున్న కలెక్టర్ సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎంజీఎం డైట్‌ సెంటర్‌ను సందర్శించి అక్కడి పరిసరాలను పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రోగులకు అందించే డైట్‌ సెంటర్‌, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత ఇన్‌చార్జిలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం సూపరిండెంట్ డాక్టర్ రామ్ కుమార్, డాక్టర్ అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!