ePaper
Monday, September 21, 2026
ePaper
Homeఎడిటోరియల్సీకేఏం కళాశాల గ్రంధాలయానికి 30 వేలు విలువ గల పుస్తకాలు విరాళం

సీకేఏం కళాశాల గ్రంధాలయానికి 30 వేలు విలువ గల పుస్తకాలు విరాళం

📰 Generate e-Paper Clip

సీకేఏం కళాశాల గ్రంధాలయానికి 30 వేలు విలువ గల పుస్తకాలు విరాళం


వరంగల్ ఆగష్టు12(నమస్తే భారత్ ) :
గ్రంధపాలకుల దినోత్సవం సందర్భంగా గ్రంథాలయ విభాగం వారి ఆధ్వర్యంలో సి.కె.ఎం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు సేవ స్ఫూర్తి ఫౌండేషన్ మరియు డాక్టర్ యెస్.వి.నారాయణ స్మారక వెల్ఫేర్ సొసైటీ ద్వారా కళాశాల గ్రంధాలయానికి 30 వేలు విలువ గల పాఠ్య, వ్యక్తిత్వ వికాసం మరియు పోటీ పరీక్షల,పుస్తకాలు విరాళంగా అందజేశారు.
ఈసందర్భంగా గ్రంథాలయాల పితామహుడిగా ఖ్యాతి గడించిన యస్.ఆర్.రంగానాధన్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా సి.కె.ఎం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ. పోషయ్య మాట్లాడుతూ విద్యార్థులకు గ్రంధాలయ ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కొరకు గ్రంధాలయంలో లభ్యమయ్యే పోటీ పరీక్షల పుస్తకాలు మరియు ఎలెక్ట్రానిక్ వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ముఖ్య అతిధి ప్రొఫెసర్ మల్లం నవీన్ మాట్లాడుతూ మారుతున్న ప్రపంచ పోకడల అనుగుణంగా విద్యార్థులు కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించు కోవలన్నారు.సి.కె.ఎం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వరప్రసాద్ రావు మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా భావ వ్యక్తీకరణ, మానసిక ఉల్లాసం , ఏకాగ్రత పెరుగుదలకు తోడ్పాటు అవుతుందన్నారు. అనంతరం సేవా స్పూర్తి ఫౌండేషన్ మేనేజర్ రత్నాకర్ వారి సంస్థ స్థాపకులు వొంగురు విజయ్ భాస్కర్ రెడ్డి ద్వారా గ్రంధాలయనికి విరాళంగా పంపిన పాఠ్య, వ్యక్తిత్వ వికాసం మరియు పోటీ పరీక్షల పుస్తకాలనుసి.కె.ఎం కళాశాల కళాశాల ప్రిన్సిపాల్ కి అందజేశారు. పుస్తకాలను విరాళంగా అందించిన సేవ స్ఫూర్తి సంస్థ మరియు డాక్టర్ యెస్.వి.నారాయణ స్మారక వెల్ఫేర్ సొసైటీ వారికి ప్రిన్సిపాల్ ,అధ్యాపకబృందం కృతజ్ఞతలు తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మల్లం నవీన్ , గ్రంధపాలకులు యస్. అనిల్ కుమార్ , అధ్యాపకులు కెప్టెన్ డాక్టర్ సతీష్ కుమార్ , డాక్టర్ అయేషా, డాక్టర్ వసుధ, వెంకటేశ్వర్లు, డాక్టర్ పూర్ణచందర్ , సురేష్ , అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!