రూపా రెడ్డి హత్య ఘటనను తీవ్రంగా ఖండించిన ఎండి
సీపీఐ జిల్లా సమితి సభ్యులు.అబ్దుల్ రషీద్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని అంగడి ఆవరణలో సమావేశంలో మాట్లాడుతూ సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్
నల్గొండ జిల్లాలో ప్రిన్సిపాల్ రూపా రెడ్డిపై టెన్త్ క్లాస్ విద్యార్థులు దాడి చేసి హత్య చేసిన ఘటనను సీపీఐ తీవ్రంగా ఖండిస్తుందని ఎండి అబ్దుల్ రషీద్ అన్నారు.
మరిపెడ మండల కేంద్రంలోని అంగడి ఆవరణలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, విద్యార్థులు చదువుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన వయసులో ఇలాంటి హింసాత్మక ఘటన జరగడం అత్యంత ఆందోళనకరమైన విషయమన్నారు.
సమాజంలో ఆల్కహాల్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల ప్రభావం యువతపై తీవ్రంగా పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు గురికావడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు, చదువు, ప్రవర్తన దెబ్బతినడంతో పాటు హింసాత్మక ధోరణులు పెరిగే ప్రమాదం ఉందన్నారు.
పాఠశాలలు, కళాశాలల పరిసర ప్రాంతాల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ విక్రయాలు, సరఫరాపై కఠిన నిఘా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు, పెన్నులు ఉండాల్సిన వయసులో మత్తు పదార్థాలు, హింస ప్రవేశించడం సమాజానికి ప్రమాదకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసు, విద్యాశాఖ, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని ఎండి అబ్దుల్ రషీద్ కోరారు.
ప్రిన్సిపాల్ రూపా రెడ్డి కుటుంబానికి సీపీఐ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.



