విద్యారంగ సమస్యలు పరిష్కారించాలి
విద్యా కమిషన్ సభ్యులు చారుగొండ వెంకటేష్ కు పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ వినతి
నమస్తే భారత్ :-మరిపెడ
విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని పిఆర్టీయూ మరిపెడ మండల ప్రధాన కార్యదర్శి లింగల మహేష్ గౌడ్ విద్యా కమిషన్ సభ్యులు చారగొండ వెంకటేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులపై బోధనేతర పనిభారం.తగ్గించాలిన,విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు.ప్రతి పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని,డిజిటల్ బోధనకు అవసరమైన సాంకేతిక సదుపాయాలు అందించాలని అన్నారు.ఉపాధ్యాయులకు నాణ్యమైన, ఆచరణాత్మక శిక్షణ నిరంతరం ఇవ్వాలని,బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా, సకాలంలో నిర్వహించాలి అని అన్నారు.పాఠశాలలపై అనవసరమైన రిపోర్టులు, ఆన్‌లైన్ డేటా పనిభారం తగ్గించాలి అని అన్నారు.ఉపాధ్యాయుల వృత్తిపరమైన గౌరవం, స్వయం ప్రతిపత్తి పెంచాలని, విద్యార్థుల అభ్యసన ఫలితాలతో పాటు ఉపాధ్యాయుల పని పరిస్థితులను కూడా విద్యా సంస్కరణల్లో పరిగణించాలి అన్నారు.భవిష్యత్ విద్యా విధానాల రూపకల్పనలో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ బాధ్యులు వెంకటయ్య, విజయ్ కుమార్, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.



